ఓకే గూటికి చేరిన సమంత నాగచైతన్య... ఏం జరిగిందో తెలుసా?

తాను ఒకటి తెలిసి దైవం మరొకటి తడిచింది అన్నట్టు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత( Samantha ) నాగచైతన్య( Nagachaitanya ) తో విడాకులు తీసుకొని విడిపోయి వరుస సినిమాలతో బిజీ అయ్యారు.అయితే చివరికి నాగచైతన్య సమంత ఇద్దరూ ఒకే గూటికి చేరారు అంటూ వీరిద్దరి గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Samantha Nagachaitanya Joined The One Group , Samantha, Nagachaitanya, Khushi, D-TeluguStop.com

అసలు సమంత నాగచైతన్య ఇద్దరు ఓకే గూటికి చేరడం ఏంటి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు.

Telugu Divorce, Khushi, Nagachaitanya, Samantha-Movie

ఎప్పుడైతే విడాకులు( Divorce ) తీసుకుని విడిపోయారో ఆ క్షణం నుంచి ఆ ప్రభావం వీరి సినీ కెరియర్ పై కూడా పడిందని చెప్పాలి.ఈ విధంగా విడాకుల తర్వాత సమంత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అలాగే ఈమె మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.

దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.అదే విధంగా సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను మరో ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నానంటూ ప్రకటించారు.

Telugu Divorce, Khushi, Nagachaitanya, Samantha-Movie

సమంత చేతిలో ప్రస్తుతం ఖుషి ( Khushi ) సినిమా తోపాటు సిటాడెల్ ( Citadel ) వెబ్ సిరీస్ మాత్రమే ఉన్నాయి.ఈ రెండు పూర్తి అయితే ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవని చెప్పాలి.మరోవైపు నాగచైతన్య పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.విడాకుల సమయంలో ఈయన నటించిన లవ్ స్టోరీ ( Love Story ) సినిమా సక్సెస్ అయింది.

అనంతరం నాగచైతన్య నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.తాజాగా ఈయన కస్టడీ ( Custody ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా పెద్దగా ఫలితాన్ని అందించలేకపోయింది.ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

దీంతో పెళ్లి విడాకుల తర్వాత వీరిద్దరూ సినిమా సక్సెస్ లు లేకుండా ఇద్దరు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూనే ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా లేకుండా ఉన్నారంటూ సమంత నాగచైతన్య గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube