Prince Narula , Yuvika Chaudhary : దేవుడు రాసిన రాతను మనం మార్చలేం.. ఆ వార్తలు విని విసుగొచ్చింది: బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ షో ( Bigg Boss Show )బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.బిగ్ బాస్ షో అన్ని భాషల్లో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

 Yuvika Chaudhary Says Planning Child Wedding Prince Narula-TeluguStop.com

సీజన్ల మీద సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది.ఇకపోతే మామూలుగా బిగ్ బాస్ షో లో లవ్ స్టోరీలు అన్నవి కామన్.

కొంతమంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు మాత్రమే ప్రేమ పక్షుల్లా ఉంటే కొంతమంది బయట కూడా ఆ లవ్ నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ ఈ ప్రేమకథలన్నీ షోకు శుభం కార్డు పడే సమయానికే ముగిసిపోతాయి.

Telugu Child, Prince Narula-Movie

అంటే చాలామటుకు డ్రామానే ఉంటుంది.కొందరు మాత్రం నిజంగా ప్రేమించుకుని, బయటకు వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు.అలా బిగ్‌బాస్‌ షోతో మొదలైన ప్రేమను పెళ్లితో పదిలపర్చుకున్న జంట ప్రిన్స్‌ నరూలా, యువికా చౌదరి( Prince Narula , Yuvika Chaudhary ).వీరిద్దరూ తొలిసారి హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో కలుసుకున్నారు.అప్పటినుంచి వీరి మధ్య సమ్‌సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో హార్ట్‌ షేప్‌ పరాటా చేసి మరీ తనను మెప్పించాడు ప్రిన్స్‌.ఏడాది తిరిగేసరికి వీరు పెళ్లి కూడా చేసుకున్నారు.2016 నుంచి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్న వీరు ఎంతోకాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు.

Telugu Child, Prince Narula-Movie

తాజాగా ఈ విషయంపై నటి యువికా చౌదరి( Actress Yuvika Chaudhary ) మాట్లాడుతూ.యుక్త వయసు రాగానే పెళ్లెప్పుడు? అని అడుగుతారు.పెళ్లి చేసుకున్న తరువాత పిల్లలెప్పుడు కంటున్నావు? అని ప్రశ్నిస్తారు.ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయింది.నిజానికి మేము పెళ్లయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నాము.కానీ ఆ భగవంతుడి ఆలోచన మరోలా ఉన్నట్లుంది.దేవుడు రాసిన రాతను మనం మార్చలేం కదా! అని చెప్పుకొచ్చింది యువికా చౌదరి.

కాగా ప్రిన్స్‌ నరూలా ఎమ్‌టీవీ రోడీస్‌ 19లో గ్యాంగ్స్‌ లీడర్స్‌లో ఒకరిగా పార్టిసిపేట్‌ చేస్తున్నాడు.యువికా గతేడాది వచ్చిన సైబర్‌ వార్‌ సినిమా, రూహనియత్‌ అనే వెబ్‌ సిరీస్‌లో చివరిసారిగా కనిపించింది.

దాదాపు ఏడేళ్లుగా వీరి బంధం కొనసాగుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube