బాగా ధనవంతులు అనగానే పెద్ద పెద్ద బిజినెస్‌మెన్లు గుర్తుకొస్తారు.ఎలాన్ మస్క్, అదానీ, అంబానీ, బిల్‌గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి.
ఇక హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులు రూ.కోట్లు సంపాదిస్తూ ఉంటారు.వీరిని అందరూ ధనవంతులుగా పరిగణిస్తారు.ఇక రాజకీయ నాయకులు కూడా అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు.దీంతో వారిని కూడా ధనవంతులుగా సమాజంలో పరిగణిస్తారు.అయితే బిచ్చగాళ్లల్లో( Beggar ) కూడా ధనవంతులు ఉన్నారట.
ఎన్నో రూ.కోట్లు సంపాదించి ధనవంతులుగా మారుతున్నారట.చిచ్చమెత్తుకుంటూ రూ.కోట్ల సంపాదిస్తున్నారట.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా( World Richest Beggar ) భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు.అతడే పేరే భరత్ జైన్.( Bharat Jain ) ఎకనామిక్స్ టైమ్స్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.ఇండియాలోనే కాదు.ప్రపంచంలోనే అత్యంత బిచ్చగాడిగా ఇతడు ఉన్నట్లు గుర్తించింది.ప్రస్తుతం ఇతడు ముంబైలో( Mumbai ) నివసిస్తున్నాడు.ఇతడికి రూ.1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి.అలాగే ఇటీవల మహారాష్ట్రలోని థానేలో రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు.ఈ ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా అతడికి నెలకు రూ.30 వేల అద్దె వస్తుంది.భరత్ జైన్ నికల ఆస్తుల విలువ రూ.7.5 కోట్లుగా ఉంది.అతడు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నాడట.

2014 నాటికి భిక్షాటన ద్వారానే రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు.అంటే నెలకు అతడి సంపాదన అప్పట్లోనే రూ.75 వేలుగా ఉంది.ప్రస్తుతం భరత్ జైన్ కుటుంబం పరేల్‌లోని 1BHK డ్యూప్లెక్స్ ఇంటిలో ఉంటుంది.ఇతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండగా.వారిని బాగా చదివిస్తున్నాడు.ఇన్ని డబ్బులు ఉన్నా ఇంకా అతడు భిక్షాటన వదిలిపెట్టలేదు.
ముంబైలోని రైల్వే స్టేషన్,.ఆజాద్ మైదాన్ లాంటి రద్దీ ప్రదేశాల్లో భరత్ జైన్ భిక్షాటన చేస్తున్నాడు.







