అక్కడ బీర్ సీసాలతో ఆలయం, మూతలలో విగ్రహాన్ని ప్రతిష్టించారు... ఎక్కడో తెలుసా?

అదేంటి గుడంటున్నారు… మరి బీర్ సీసాలతో ఆలయం( Temple with beer bottles ), మూతలలో విగ్రహాన్ని ప్రతిష్టించడం ఏమిటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.సాధారణంగా ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఇటుక, ఇసుక, ఇనుము ఉపయెగించి మనం కడతాము.

 There Was A Temple With Beer Bottles, A Statue In The Lids You Know Somewhere ,-TeluguStop.com

అలాంటిది పవిత్రమైన ఆలయాన్ని బీర్ సీసాలతో కట్టడమా? అయ్యో రామ! అలాంటి ఘోరాలు మన దేశంలో మాత్రం జరగలేదు కదా అని అనుమానం కలగక మానదు.అయితే ఇది మనదేశంలో జరగలేదు.

థాయిలాండ్( Thailand ) దేశంలో ఇటువంటి కట్టడం వెలసింది.థాయిలాండ్ అనగానే గుర్తొచ్చేవి కొబ్బరిచెట్లు, థాయ్ బీచ్ మసాజ్ సెంటర్లు, బౌద్ధ క్షేత్రాలు.

Telugu Beer Bottle, Idol Lids, International, Latest, Templebeer-Latest News - T

అవును, అవన్నీ ఒకెత్తయితే ‘వాట్ పా మహా చేడీ క్యూ’( Wat pa maha chedi q ) ఆలయం అనేది మరో ఎత్తు.దీని స్పెషాలిటీ ఏమిటంటే? సిమెంట్, ఇటుకలతో కాకుండా… ఏకంగా 15 లక్షల బీర్ బాటిళ్లతో దీని నిర్మాణాన్ని చేపట్టారు.అందుకే దీనికి ‘మిలియన్ బాటిల్ టెంపుల్’( Million Bottle Temple ) అని అక్కడివారు పిలుస్తూ వుంటారు.థాయిలాండ్లోని సిసాకెత్ ప్రావిన్స్లో ఖుసహాన్ జిల్లాలో ఈ ఆలయం కొలువుదీరింది.

సముద్రతీరాల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఖాళీ బీర్ సీసాలను గమనించిన బౌద్ధ సన్యాసులకు ఓ ఆలోచన తట్టింది.ఇటుకలకు బదులుగా బీర్ సీసాలతో అందంగా ఓ గుడిని రూపొందిస్తే బాగుంటుందనుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఖాళీ బీర్ సీసాలను సేకరించి, కేవలం రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

Telugu Beer Bottle, Idol Lids, International, Latest, Templebeer-Latest News - T

ఆలోచన నచ్చడంతో స్థానిక ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా లక్షలాది ఖాళీ బాటిళ్లను సమకూర్చింది.ఆలయ ప్రాంగణంతో పాటు మెట్లు, వాష్ రూంలు, విశ్రాంతి గదులు, ప్రహారీ, నేల, కొలను, నీళ్ల ట్యాంకు… ఇలా అన్నీ సీసాలతో నిర్మించినవే కావడం ఇక్కడి ప్రత్యేకత.చివరికి శ్మశానవాటికను కూడా వీటితోనే కట్టడం విశేషం.

మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీర్ బాటిళ్ల మూతలను రీసైక్లింగ్ చేసి బుద్ధుడి విగ్రహాన్ని తయారు చేయడం.నిర్మాణంలో ఆకుపచ్చ రంగు సీసాలను అక్కడక్కడ ఉపయోగిస్తూ, మధ్యలో మట్టి రంగు సీసాలను పేర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఈ సీసాలు ఎప్పటికీ రంగును కోల్పోవట.థాయిలాండ్ వెళ్లే పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది.

అక్కడికి వెళ్లిన వారు ఆలయం ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తూ తెగ మురిసిపోతుంటారు మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube