Ajith Kumar : ఒక్క పోస్టర్..అజిత్ ఎంతో ముచ్చటపడ్డాడు ..కానీ చివరికి ఇలా అయ్యింది !

ఏజే మురుగన్(AJ Murugan ).తీసింది ఒకటే హిట్ సినిమా (మన్మధన్) కానీ అటు కోలివుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నాడు.

 Ajith Intrest In Manmadha Movie-TeluguStop.com

అయితే మురుగన్ మన్మధన్ సినిమాకు మొదటగా శింబును హీరోగా అనుకోలేదు.అప్పట్లో అజిత్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

తన అద్భుతమైన నటనతో అందరి దర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.దాంతో మురుగన్ కూడా తన దగ్గర ఉన్న మంచి స్టోరీని అజిత్‌తో కలిసి తెరకెక్కించాలనుకున్నాడు.

అంతేకాదు, మన్మధన్ మూవీ స్టోరీ లైన్ కూడా చెప్పాడు.దాంతో అజిత్ ఇంప్రెస్ అయ్యాడు.

ఆ తర్వాత అజిత్ ముఖచిత్రంతో ఒక కాన్సెప్ట్ పోస్టర్ డిజైన్ చేయించాడు.

అది చూసిన తర్వాత అజిత్ ఎంతో ముచ్చట పడ్డాడు.

అంతేకాదు ఈ సినిమా చేయడానికి కూడా అంగీకరించాడు.ఈ కాన్సెప్ట్ పోస్టర్‌లో అజిత్ ఫేస్ ఉంటుంది.

అలాగే ప్రతిదీ తలరాత ప్రకారమే జరుగుతుందని ఒక ఫిలాసఫీని ఈ పోస్టర్‌లో పెద్ద అక్షరాలతో రాశారు.ఇక ఇదే పోస్టర్‌లో అజిత్ చుట్టూ అందమైన అమ్మాయిలను కూడా ప్రచురించారు.

వారు పలు రకాల శృంగార భంగిమల్లో కనిపించారు.ఒక పక్క రొమాన్స్ ను చూపించే గులాబీ పువ్వులు, మరో పక్క ప్రమాదాన్ని సూచించే పుర్రెలూ గుట్టగా ఇందులో కనిపించాయి.

Telugu Aj Muragan, Ajith, Ajith Kumar, Jyothika, Kollywood, Manmadha, Manmadhan,

అజిత్ నుదుటిమీద రాసిన తలరాత ఫిలాసఫీ అనేది మన్మధన్( Manmadhan ) కథ సారాంశమని మురుగన్ ఈ పోస్టర్ ద్వారా తెలియజేసి తన క్రియేటివిటీ లెవెల్స్ నిరూపించాడు.ఆ తలరాతలో “ఇతడు మనుసులు దోచేస్తాడు.ఇది అతని విధి రాత.మార్చాలన్నా మార్చలేడు.ఒక శిక్షకుడిగా తనకి విధించబడిన కర్తవ్యమది.ఇతను చేస్తున్నది తప్పో ఒప్పో దేవుడే నిర్ణయిస్తాడు.” అని మురుగన్ పోస్టర్‌లో అజిత్ ఫేస్ పై రాశాడు.

Telugu Aj Muragan, Ajith, Ajith Kumar, Jyothika, Kollywood, Manmadha, Manmadhan,

అయితే ఈ పోస్టారంతా అజిత్‌కి నచ్చింది.కానీ అప్పటికే డైరెక్టర్ రాజీవ్ మీనన్‌తో ప్రియురాలు పిలిచింది సినిమాకి అజిత్ ఒప్పుకున్నాడు.మరో ప్రాజెక్టుకీ కమిట్ అయ్యాడు.

అయినా మన్మధన్‌ సినిమా చేస్తానని, కాకపోతే కాస్త సమయం ఇవ్వాలని ఏజే మురుగన్‌ని అజిత్ కోరాడు.కానీ మురుగన్‌ తొందరపడి అజిత్ స్థానంలో శింబును తీసుకొని సినిమా తెరకెక్కించాడు.

ఈ మూవీ హిట్ అయింది కానీ అతనికి కెరీర్ పరంగా ఈ సినిమాతో పెద్దగా ఒరిగిందేమీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube