భోపాల్ కు చెందిన యువతి ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేసి ఆన్ లైన్ లో లెక్కలు బోధిస్తూ ఉంటుంది.అయితే ఇప్పటికీ దాదాపుగా 12 పెళ్లి చూపులు జరిగాయి.
ఒక్క సంబంధం కూడా కుదరకపోవడానికి ప్రధాన కారణం వరకట్నం( Dowry ).పెళ్లిచూపులు చూసిన వారంతా చివరకు రూ.50 లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఆ యువతి విసిగిపోయి కట్నం ఇస్తేనే పెళ్లిళ్లు జరుగుతాయా.
లేదంటే జరగవా అంటూ పోరాటానికి దిగి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.కట్నం విషయంలో అందరిలో మార్పు రావాలని అన్ని చోట్ల చైతన్యానికి నడుం బిగించింది.
ఆ యువతికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.భోపాల్( Bhopal ) లో ఉంటున్న యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ఈమెకు 27 ఏళ్లు వచ్చేశాయి.దాదాపుగా 5 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఈమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
ఆ యువతి తండ్రి వందకు పైగా యువకుల ప్రొఫైల్స్ చూసి 20 మందిని సెలెక్ట్ చేశాడు.వారిలో 12 మంది పెళ్లిచూపులు చూసి చివరికి కట్నం డిమాండ్ చేశారు.
ఆ యువతి మా నాన్న అంత ఖర్చు చేయలేడు.కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటారా అని పెళ్లి చూపులకు వచ్చిన యువకులను ప్రశ్నిస్తే సంబంధం క్యాన్సల్ చేసి వెళ్ళిపోతున్నారు.
మరొకవైపు బంధువులు, చుట్టుపక్కల వారు వయసు పెరిగితే పెళ్లి కావడం కష్టం అని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతున్నారు.తాను కట్నం ఇవ్వడం వద్దన్నందుకు తన తల్లి తనతో మాట్లాడడం లేదని.
కట్నం ఇవ్వకపోతే ఈ జన్మలో పెళ్లి జరగదని తన తండ్రి టెన్షన్ పడుతున్నాడని, ఆ యువతి ఆందోళన చెందుతూ సమాజంలో కట్నం విషయంలో మార్పు రావాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
భారతదేశంలో 1961 లో వరకట్నం ను నిషేధించారు.అయినా కూడా ఎంతోమంది కోడళ్ళు వరకట్నం కారణంగా హత్యకు గురికావడం లేదంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేసుకుంటూనే ఉన్నారు.కొందరు తెలివిమంతులు కట్నం ఇవ్వండి అని నేరుగా అడగలేక లాంఛనాలు ఇవ్వడం ఫార్మాలిటీ అని ఆడపిల్ల తల్లిదండ్రులను అడుగుతున్నారు.
నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం భారతదేశంలో 2017 నుంచి 2022 వరకు దాదాపుగా 35493 మంది నవవధువులు వరకట్న చావులకు గురయ్యారు.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు పెళ్లి జరిగే ప్రతి చోటకు వెళ్లి చెకింగ్లు చేస్తే సమాజంలో కాస్తయినా మార్పు వస్తుందని కోరుకుంటుంది ఆ యువతి.
ఈ మేరకు ఆమె భోపాల్ పోలీస్ కమిషనర్ హరి నారాయణ్( Hari Narayan ) ను కలిసి వినతి పత్రం ఇచ్చింది.వరకట్న దురాచారం వల్ల వస్తున్న ఆర్థిక భాదల గురించి చైతన్యం రావాలని మీడియాను సంప్రదించింది.
ఈ స్థితికి తాము ఎంత కారణమో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆ యువతి ప్రశ్నిస్తోంది.