బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను జనబలంతో కొట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.గతంలో గ్రామ పెద్ద చెబితే ఓటు వేశారు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.బీజేపీ, బీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు.
పెండింగ్ లో ఉన్న మూడు జిల్లాల కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.ఈనెల 25 లోగా రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పూర్తి చేస్తామని తెలిపారు.
గ్రామస్థాయిలోనే కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓట్లను గుర్తించాలని సూచించారు.అదేవిధంగా ఆగస్ట్ 18న హైదరాబాద్ మండల అధ్యక్షులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు.