బరువు తగ్గాలంటే ఈ పిండితో చపాతీలు తినండి..!

ప్రస్తుత జీవనశైలి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.అందులో ముఖ్యంగా అధిక ఉబకాయం, మధుమేహం( Diabetes ) వంటివి ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి.

 If You Want To Lose Weight, Eat Chapatis With This Flour..! Oat , Diabetes , L-TeluguStop.com

అయితే వీటన్నిటికీ ఒక రకంగా ఒత్తిడి, అధిక బరువే కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ భయం కారణంగా చాలా వరకు ఎక్కువ మంది ముందుగానే బరువును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలను చూడవచ్చు.

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినకుండా చపాతీ తినడం మొదలుపెట్టారు.

అయితే చపాతీ ( Chapati )బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.అయితే బరువు తగ్గేందుకు చపాతి తినే వారు గోధుమపిండితో చేసే చపాతి తింటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

ఎందుకంటే గోధుమపిండిలో కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కేలరీలు ఉంటాయి.అయితే ఏ పిండి చపాతి తినాలి ఏ పిండి చపాతి సులభంగా బరువు తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Oat, Chapati, Diabetes, Tips, Lose-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే బియ్యం, మైదా, గోధుమలతో పోలిస్తే మిల్లెట్ బయటీ చర్మంలో పాలీపెనాల్స్ అధిక సాంద్రతలో కనిపిస్తాయి.రాగుల్లో ప్రోటీన్ కంటెంట్ ను బియ్యంతో పోల్చి చూస్తే రాగుల్లోని ప్రోటీన్ కంటెంట్ బియ్యం కంటే రెండింతలు ఉంటాయి.మిల్లెట్ పిండిలో ఫైబర్ అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.ఇది తేలికగా జీర్ణం అవుతుంది.రాగుల పిండి( Ragi Pindi Chapati )లో గ్లూటెన్ ఉండదు.ఊబకాయానికి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పిండి ఎంతో ఉపయోగపడుతుంది.

Telugu Oat, Chapati, Diabetes, Tips, Lose-Telugu Health Tips

అలాగే ఓట్స్( Oats ) బరువు తగ్గడానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతాయి.ఉదయాన్నే ఓట్ మీల్ తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.మీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు.బియ్యం, గోధుమపిండి, వలే క్వినోవా పిండిని కూడా ఇప్పుడు చాలా మంది తమ ఆహారంలో ఉపయోగిస్తున్నారు.క్వినోవా పిండిలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది అనారోగ్య కేలరీలను వదిలించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది మన బరువును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube