చిన్నారి గుండె ఆపరేషన్ కు రక్షక భటులే సేవా మూర్తులుగా తరలివస్తున్న వైనం!

వేములవాడ పట్టణ సీఐ ఓ వెంకటేష్( CI O Venkatesh ) ₹10,000 విరాళం అందజేత! పోలీసులు అంటే శాంతి భద్రతలోనే కాదు సేవా దృక్పథంలో కూడా ముందుంటామని నిరూపిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట( Hanmajipet ) గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి ఆపరేషన్ నిమిత్తం సోషల్ మీడియా వేదికగా బాధిత కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిని చూసి వేములవాడ పట్టణ సీఐ ఓ, వెంకటేష్ చలించి పోయారు.

 Children's Heart Operation Is The Lifeguards Who Are Flocking To Serve As Idols-TeluguStop.com

వెంటనే తన వంతు సహాయంగా బాధిత కుటుంబానికి పదివేల రూపాయల విరాళం అందించి తన సహృదయాన్ని చాటుకున్నారు.కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్న పోలీసుల సేవా దృక్పథాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఈ సందర్భంగాచిన్నారి కుటుంబ సభ్యులు సిఐ ఓ వెంకటేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube