చిన్నారి గుండె ఆపరేషన్ కు రక్షక భటులే సేవా మూర్తులుగా తరలివస్తున్న వైనం!

వేములవాడ పట్టణ సీఐ ఓ వెంకటేష్( CI O Venkatesh ) ₹10,000 విరాళం అందజేత! పోలీసులు అంటే శాంతి భద్రతలోనే కాదు సేవా దృక్పథంలో కూడా ముందుంటామని నిరూపిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట( Hanmajipet ) గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి ఆపరేషన్ నిమిత్తం సోషల్ మీడియా వేదికగా బాధిత కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిని చూసి వేములవాడ పట్టణ సీఐ ఓ, వెంకటేష్ చలించి పోయారు.

వెంటనే తన వంతు సహాయంగా బాధిత కుటుంబానికి పదివేల రూపాయల విరాళం అందించి తన సహృదయాన్ని చాటుకున్నారు.

కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్న పోలీసుల సేవా దృక్పథాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఈ సందర్భంగాచిన్నారి కుటుంబ సభ్యులు సిఐ ఓ వెంకటేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇకపై ఈ వస్తువులను విమానం ప్రయాణ సమయంలో తీసుకెళ్లలేరు..