టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.ఇందులో భాగంగా లోకేశ్ చేసిన ఆరోపణలపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉందని లోకేశ్ కు నిరూపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.అభివృద్ధిపై చర్చకు సిద్ధమని లోకేశ్ ప్రకటిస్తే అర గంటలో వస్తానని తెలిపారు.
నెల్లూరు సిటీలో లోకేశ్ పోటీ చేయాలన్న మాజీ మంత్రి అనిల్ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.







