టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్( Liger ).గత ఏడాది విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అటు డైరెక్టర్ పూరి జగన్నాథ్( Director Puri Jagannadh ), ఇటు హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత చార్మిలపై భారీ స్థాయిలో విమర్శలు నెగిటివ్ కామెంట్స్ విడిపించాయి.ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉన్నారు.
అంతేకాకుండా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తీవ్రంగా నష్టపోయామని నష్టపరిహారం చెల్లించాలి అని సినిమా విడుదలైన తర్వాత పూరి జగన్నాథ్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఆ సమయంలో ఆయన ఎలాగో అలాగా నచ్చజెప్పి ఆ వివాదానికి అడ్డుకట్ట వేశారు.కానీ ఆ వివాదం అంతటితో ముగియలేదు.
ఇటీవల మరోసారి డిస్ట్రిబ్యూటర్లు బయర్లు ధర్నా చేసిన విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ( Vijay Deverakonda Brother ) స్పందించారు.
ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం బేబీ.సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈనెల 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రస్తుతం మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్( Baby Movie ) లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ లైగర్ సినిమా గురించి స్పందించారు.అన్న కరిష్మా, లుక్స్ మాత్రమే కాకుండా ఆయన డైలాగ్ డెలివరీ, వాయిస్‌ను ఎక్కువ మంది ఇష్టపడతారు, ప్రేమిస్తారు.
పెళ్లిచూపులు( Pelli Chupulu ) నుంచి ఒక డిఫరెంట్ వాయిస్ ఇండస్ట్రీలో వినిపించింది.ఆ వాయిస్ బాగా జనాల్లోకి వెళ్లిపోయింది.అలాంటిది ఆయనతో నత్తితో మాట్లాడించడం అనేది మైనస్.

ఇదే ఎక్కువ మంది నుంచి ఇదే వినిపించింది.ప్రాపర్ క్యారెక్టర్ డిజైన్ చేసుంటే సినిమా కూడా డిఫరెంట్‌గా ఉండేది అని తన అభిప్రాయాన్ని ఆనంద్ వ్యక్తం చేశారు ఆనంద్ దేవరకొండ.లైగర్ సినిమా కోసం తన అన్నయ్య విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా కష్టపడ్డాడని,దీని కోసం రెండేళ్లు కష్టపడ్డాడని ఆనంద్ అన్నారు.
తన అన్న సినిమాలు ఫెయిల్ అయినా అన్నను పాయింట్ చేసి నువ్వు ఎఫర్ట్ పెట్టలేదు కాబట్టి సినిమా ఫెయిల్ అయ్యింది అని ఎవ్వరూ ఎప్పుడూ అనలేదు అని గుర్తు చేశారు ఆనంద్ దేవరకొండ.ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.







