జగన్( jagan ) ఎప్పుడు ఢిల్లీ టూర్( Delhi tour ) కి వెళ్ళినా, రాజకీయంగా అన్ని పార్టీల నేతల్లో ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది.రాష్ట్ర సమస్యలు, నిధులు విడుదలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు వెళ్లారనే సీఎంవో వర్గాలతో పాటు, వైసిపి ప్రచారం చేసుకుంటుంది.
అయితే జగన్ తనపై ఉన్న కేసులతోపాటు , వైస్ వివేకానంద రెడ్డి( Vivekananda Reddy ) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి.ఎవరు ఏ రకంగా ప్రచారం చేసుకున్నా, జగన్ సైలెంట్ గా ఢిల్లీకి వెళ్లి బిజెపి కేంద్ర పెద్దలతో మంతనాలు చేసి సైలెంట్ గా వచ్చేస్తుంటారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పేందుకు జగన్ అంతగా ఇష్టపడరు.తాజాగా మరోసారి జగన్ ఢిల్లీకి వెళ్లారు.
ఎప్పటిలాగే రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే అసలు జగన్ ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా, అప్పుడే ఎన్నికల హడావుడి మొదలయింది.ఒకపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండగా, మరోపక్క టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువ గళం పాదయాత్ర ద్వారా విరుచుకుపడుతున్నారు.అలాగే బిజెపి నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న క్రమంలో, జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )పొత్తుల అంశం పైన జగన్ చర్చించబోతున్నారని, ఈ విషయంలో బిజెపి పెద్దల వైఖరి ఏ విధంగా ఉందనేది ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ చర్చించనున్నట్లు విశ్వసిని వర్గాల ద్వారా తెలుస్తోంది.

అలాగే ఇటీవల ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వేలో మళ్ళీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలడంతో ఈ సర్వే అంశం పైన ప్రధానితో జగన్ చర్చించనున్నారట.రానున్న రోజుల్లో రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంతో పాటు, జనసేన, టిడిపి దూకుడుకు బ్రేకులు వేసే విధంగా బిజెపి పెద్దల మద్దతు పొందేందుకు జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లు సమాచారం.







