వార్‌ లో ముగ్గురు... ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో ఆందోళన!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌( Young Tiger NTR ) హీరోగా ప్రస్తుతం దేవర సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా ను వచ్చే సమ్మర్‌ లో విడుదల చేయబోతున్నారు.

 Ntr Fans Upset Over Hrithik Roshan War 2 Movie,war 2 Movie,hrithik Roshan,ntr,nt-TeluguStop.com

ఇదే ఏడాది లో దేవర సినిమా షూటింగ్‌ ను ముగించి ఆ వెంటనే హిందీ సూపర్‌ హిట్‌ మూవీ ‘వార్‌’ సీక్వెల్‌ అయిన వార్ 2( War 2 ) లో నటించేందుకు ఎన్టీఆర్‌ డేట్లు ఇవ్వడం జరిగింది.హృతిక్ రోషన్ హీరోగా నటించబోతున్న వార్‌ 2 లో ఎన్టీఆర్‌ పాత్ర ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదు.

ఎన్టీఆర్ మరియు హృతిక్‌ రోషన్ ల మధ్య ఉండే సన్నివేశాలు నందమూరి అభిమానులకు కన్నుల విందు చేయడం ఖాయం అంటూ ధీమా తో ఉన్నారు.

Telugu Hrithik Roshan, Ntr Fans, Screen Space, War-Movie

ఈ నేపథ్యం లోనే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌( NTR Fans ) ని ఆందోళన పెట్టే ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వార్‌ 2 సినిమా లో హృతిక్‌ రోషన్‌.( Hrithik Roshan ) ఎన్టీఆర్ లతో పాటు మరో స్టార్‌ హీరో కూడా ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఒక సినిమా లో ముగ్గురు హీరోలు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.ముగ్గురు అంటే కచ్చితంగా ఎన్టీఆర్‌ పాత్రకు సరైన ప్రాముఖ్యత దక్కక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో నందమూరి ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Hrithik Roshan, Ntr Fans, Screen Space, War-Movie

ఈ విషయం లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆందోళన లో అర్థం ఉంది అంటూ కొందరు అంటున్నారు.సాధారణంగా సోలో హీరో అయితే సినిమా మొత్తం ఒక్కరే కనిపిస్తారు.కానీ ఇద్దరు హీరోలు ఉంటే స్క్రీన్‌ స్పేస్ తక్కువగా ఉంటుంది.

అలాంటిది ముగ్గురు హీరోలు ఉంటే ముగ్గురికి సమానమైన స్క్రీన్‌ టైమ్‌ పెట్టినా కూడా వర్కౌట్‌ అవ్వదు.మా అభిమాన హీరో యొక్క స్క్రీన్‌ స్పేస్( NTR Screen Space ) తక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి.

అందుకే ఎన్టీఆర్‌ తో పాటు మరో హీరో కూడా వార్‌ 2 లో ఉంటే కచ్చితంగా ఫలితం తారు మారు అవ్వడంతో పాటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కి నిరాశే మిగులుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube