కార్పోరేట్ కంపెనీల్లో( corporate companies ) ఉద్యోగిగా జాయిన్ కావడం వల్ల ఎక్కువ శాలరీ పొందొచ్చు.కానీ ఆ సంస్థల్లో ఉండే పని ఒత్తిడి, టార్గెట్స్, షిఫ్ట్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.
అయినా డబ్బు కోసం, ఆర్థిక భద్రత కోసం, కుటుంబ సభ్యులను చూసుకోవాలనే బాధ్యతలను నెరవేర్చడానికి ఉద్యోగులు తమ మనసు చంపుకొని అలానే పనులు చేస్తుంటారు.ముఖ్యంగా నిద్రాహారాలు మానేసి టార్గెట్స్ రీచ్ అవుతుంటారు.
లేని పక్షంలో కంపెనీలు వారికి తీవ్రమైన శిక్షలు విధిస్తుంటాయి.

అయితే తాజాగా ఒక కంపెనీ తన ఉద్యోగులకు వింత పనిష్‌మెంట్( Punishment ) ఇచ్చి షాక్ ఇస్తోంది.చైనాకు( china ) చెందిన ఈ కంపెనీ టార్గెట్స్ రీచ్ అవ్వని ఉద్యోగుల చేత కాకరకాయలు ( Bitter gourd )తినిపించింది.వినడానికి చాలా వింతగా, షాకింగ్ గా అనిపించినా ఇది నిజం.
కాకరకాయలు ఎంత చేదుగా ఉంటాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.వీటిని ఉద్యోగుల చేత కంపెనీ బలవంతంగా తినిపించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

ఉద్యోగులు మీకేమైనా బానిసలా? వారిని ఇలా హింసించడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? అంటూ నెటిజెన్లు కంపెనీ పై ఫైర్ అవుతున్నారు.ఇలాంటి కంపెనీలో పని చేయడం కంటే రోడ్డుమీద టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం మంచిదని మరికొందరు సలహా ఇస్తున్నారు.అయితే ఈ విమర్శలను కంపెనీ తిప్పి కొట్టింది.రివార్డ్ అండ్ పనిష్‌మెంట్ పాలసీలో భాగంగానే ఈ శిక్షను తాము విధించినట్లు స్పష్టం చేసింది.ఇలాంటి ఏం శిక్షలకు ఉద్యోగులు ముందుగానే అంగీకరించి జాయిన్ అయ్యారని క్లారిటీ ఇచ్చింది.ఏదేమైనా కంపెనీ తీరు అస్సలు బాగోలేదని నెటిజన్లు కంపెనీని ఏకిపారేస్తున్నారు.







