మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకున్న సంగతి తెలిసిందే.ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగరడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీజేపీలోకి వెళ్లిన మరో నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గీయులు ఇవాళ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నారు.బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో అజిత్ పవార్ వర్గం సమావేశం కానుండగా మరోవైపు దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ లో శరద్ పవార్ వర్గం భేటీ కానున్నారని తెలుస్తోంది.
అయితే ఇటీవల ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన అజిత్ పవార్ తనకు పార్టీలోని సుమారు 53 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెబుతున్న విషయం తెలిసిందే.కానీ ఈ వ్యాఖ్యలను శరద్ పవార్ వర్గం ఖండిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పోటీ పోటీ సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







