ప్రభాస్ కథతో బన్నీ కొత్త సినిమా... ఆ స్టోరీతోనే ప్లాన్ చేసిన త్రివిక్రమ్?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2సినిమా( Pushpa 2 Movie ) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

 Bunny's New Movie With Prabhas' Story ,allu Arjun, Prabhas, Puspha 2 Movie, T-TeluguStop.com

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారని ఇన్ని రోజులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు కానీ అల్లు అర్జున్ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Allu Arjun, Badrinath, Prabhas, Puspha, Tollywood-Movie

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇదివరకే త్రివిక్రమ్ ప్రభాస్ కు వినిపించారట.ప్రభాస్ ( Prabhas ) కి వినిపించిన కథతోనే త్రివిక్రమ్ తిరిగి అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారంటూ వార్త వైరల్ గా మారింది.త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా మహాభారతం ( ( ( Mahabaratham ) ఆధారంగా ఓ సోసియో ఫాంటసీ కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని తెలుస్తోంది.

అయితే బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కోసం ఎంతో మంది డైరెక్టర్లు కొన్ని కథలను వినిపించారు.

Telugu Allu Arjun, Badrinath, Prabhas, Puspha, Tollywood-Movie

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తనతో సినిమా చేయడం ఓ కథ చెప్పారట కొన్ని కారణాలవల్ల ప్రభాస్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కుదరలేదు.అయితే ఆరోజు ప్రభాస్ కి చెప్పిన కథలో అల్లు అర్జున్ కి అనుకూలంగా కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యారని తెలుస్తుంది.అయితే ఇదివరకే అల్లు అర్జున్ బద్రీనాథ్ వంటి ఫాంటసీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

బద్రీనాథ్( Badrinath ) సినిమాలో అల్లు అర్జున్ ఫాంటసీ స్టోరీ ప్రయోగం చేశారు.ప్రస్తుతం మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో అలాంటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube