మెగా డాటర్ నిహారిక(Niharika) విడాకులు(Divorce) తీసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ మెగా ఫ్యామిలీ కానీ లేదా వెంకట చైతన్య(Venkata Chaitanya) గాని ఈ విషయంపై స్పందించలేదు.
కానీ వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండటమే కాకుండా వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం చూసి వీరిద్దరూ పక్కాగా విడిపోతున్నారని అందరూ భావించారు.నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్(Varuna Tej) నిశ్చితార్థంలో కూడా నిహారిక ఒక్కటే కనిపించడంతో ఇక వీరి విడాకులు కన్ఫామ్ అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో నిహారిక విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి.నిహారిక జొన్నలగడ్డ వెంకటచైతన్య అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ దంపతులు విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో( Family Court ) పిటీషన్ దాఖలు చేశారు.హిందూ వివాహ చట్ట ప్రకారం నిహారిక కోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం ఈ పిటిషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇక వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇక నిహారిక తన భర్తకు దూరంగా ఉంటూ తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.ప్రస్తుతం ఈమె సినిమాలు వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరి వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీ రాజస్థాన్ పురాతన కోటలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే పెళ్లయిన రెండు సంవత్సరాలకి ఈ దంపతులు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇలా నిహారిక కూడా విడాకులు తీసుకున్నారనే విషయం తెలియడంతో మెగా ఆడపడుచులకు పెళ్లిళ్లు కలిసి రాలేదా అందుకే ఇలా జరుగుతోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.







