పోలీసులంటేనే రక్షక భటులు అని అంటూ ఉంటారు.ప్రజలను రక్షించడం వారి విధి.
ప్రమాదాల సమయాల్లో ప్రజలను కాపాడటం, ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు వారిని రక్షించడం లాంటివి పోలీసులు చేస్తూ ఉంటారు.ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించి నిజమైన హీరోలుగా పోలీసులు నిలుస్తూ ఉంటారు.
తాజాగా ఒక పోలీస్ అధికారి మహిళ ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచాడు.తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రమాదంలో ఉన్న మహిళను కాపాడాడు.

కాలిపోతున్న కారులో చిక్కుకున్న ఒక మహిళను కాపాడాడు ఒక పోలీస్.పెట్రోలింగ్ వెహికల్‌లో( patrol vehicle ) ఓ పోలీస్ అధికారి రోడ్డుపై వెళుతుండగా.పక్కన దట్టమైన చెట్ల మధ్య ఏదో దగ్ధం అవుతున్నట్లు మంటలు కనిపించాయి.దీంతో కారును ఆపేసి నడుచుకుంటూ దగ్గరకు వెళ్లి చూశాడు.ఒక కారు మంటల్లో దగ్ధమవుతూ ఉండగా.అందులో ఒక మహిళ( woman ) కూడా ఉన్నట్లు గమనించాడు.
దీంతో మంటల్లో చిక్కుకున్న ఆమెను సురక్షితంగా కాపాడాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ ఎర్ర కారులో ఉన్న మహిళను పోలీస్ అధికారి మంటల్లో నుంచి బయటకు తీసినట్లు కనిపిస్తుంది.

తన లాఠీతో కారు అద్దం పగలగొట్టి మరీ మహిళను పోలీస్ కాపాడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.మంటల్లో నుంచి కాపాడిన అనంతరం మహిళను వేరే వ్యక్తి సహాయంతో రోడ్డుపైకి తీసుకెళ్లాడు.ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలవ్వగా.
ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.మహిళకు ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల్లో ఉన్న మహిళను కాపాడిన ఈ పోలీస్ అధికారిని అందరూ మెచ్చుకుంటున్నారు.ఇలాంటి పోలీస్ అధికారులు ఉంటే ప్రజలకు ఎలాంటి భయం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.







