Karthi : 30 సినిమాలు..30 మంది వేరు వేరు దర్శకులు..కొత్తదనం చూపిస్తున్న కార్తీ

కార్తీ( Karthi ).హీరో గా తన కెరీర్ స్టార్ట్ చేసాక ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించాడు.

 Karthi Variation In Choosing Movies-TeluguStop.com

ఈ సినిమాలన్నీ కూడా ఒక్కోదానికి మరొకటి సంబంధం లేకుండా జాగ్రత్త పడుతూ ఉండటం లో కార్తీ తర్వాతే ఎవరైనా.తన అన్న లాగ చాల హ్యాండ్సమ్ హీరో కాకపోయినా తండ్రి లాగ ఏళ్ళ తరబడి నటించిన చరిష్మా లేకపోయినా తనదైన రీతిలో సినిమాలో చేస్తూ ఇండస్ట్రీ లో సత్తా చాటుతూ తమిళ సినిమా హీరో అనే పేరును కాస్త సౌత్ ఇండియా లో చెప్పుకోదగ్గ ఒక హీరో అనే స్థాయికి చేరాడు.

అయితే కార్తీ లో ఉండే గొప్ప విశేషం ఏమిటి అంటే తాను నటించిన 30 సినిమాలకు 30 వేరు వేరు దర్శకులతో పని చేయడం.

Telugu Karthi, Karthi Japan, Kollywood, Mani Ratanam, Ponniyin Selvan, Sardar, S

తనకు దర్శకులను రిపీట్ చేయడం నచ్చదో లేక మరో కారణం ఏమైనా ఉందొ కానీ ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా రెండో సినిమా అవకాశం ఇవ్వలేదు.చిన్న హీరో గా కెరీర్ మొదలు పెట్టి తండ్రి బ్యాగ్రౌండ్, అన్న సపోర్ట్</em( Surya ) లేకుండా గొప్ప కథలను ఎంచుకుంటూ విభిన్నమైన హీరో అనిపించుకుంటున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.కార్తీ మాత్రమే కాదు శివ కుమార్ ఇంట్లో చాల మంది నటులే ఉన్న కూడా కార్తీ ది మాత్రం చాల భిన్నమైన ధోరణి.

ఇప్పుడు జపాన్ అనే సినిమా( Karthi Japan Movie ) లో నటిస్తున్న కార్తీ కేవలం మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం మాత్రమే 2 సినిమాలకు పని చేసాడు.సినిమా ఫలితం తో సంబంధం లేకుండా ఈ చిత్రం లో నటించిన కార్తీకి మంచి పేరు వచ్చింది.

<img src=" https://telugustop.com/wp-content/uplo

Telugu Karthi, Karthi Japan, Kollywood, Mani Ratanam, Ponniyin Selvan, Sardar, S

ఇక కార్తీ కథలను ఎంచుకునే పద్ధతి కూడా మొదటి సినిమా నుంచి చాల వేరుగా ఉంటాయి.కథ కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. డీ గ్లామర్ రోల్ అయినా, మాస్ రోల్ అయినా సరే చేయడానికి కార్తీ ఏమాత్రం వెనకాడరు.అలాగే మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడా సంబంధం ఉండదు.

తన వరకు సినిమా అంటే కథ మాత్రమే హీరో అనే పద్ధతి లో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కార్తీ.ఇక కార్తీ ఫ్యాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు.

అతను నటించిన సర్దార్ సినిమా( Sardar ) పలు భాషల్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది.తెలుగు లో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube