రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ అధినాయకత్వం కొత్త అధ్యక్షులను నియమించడం సంచలనంగా మారింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా సోము వీర్రాజుని( Somu Veerraju ) తప్పించి దగ్గుబాటి పురందేశ్వరినీ( Purendeshwari ) కొత్త అధ్యక్షురాలుగా నియమించడంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
అటు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవికి బండి సంజయ్ నీ తప్పించి.కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినీ నియమించటం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు( Vishnu Kumar Raju ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కొత్త అధ్యక్షురాలుగా నియమించబడ్డ పురందేశ్వరి గారు అపార అనుభవం ఉన్న నాయకురాలని కొనియాడారు.ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికే అధిష్టానం కొత్త అధ్యక్షులను నియమించింది అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.
మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమకు అందుబాటులో లేరని కీలక వ్యాఖ్యలు చేశారు.







