కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈయన రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో నాని( Nani ) సమంత( Samantha ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈగ( Eega ) సినిమాలో విలన్ పాత్రలో నటించారు.ఇలా విలన్ పాత్రలో నటించినప్పటికీ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయన నటించిన సినిమాల్లో కూడా తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.తాజాగా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా సినిమా విడుదలయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇకపోతే ఈయన తన తదుపరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న సుదీప్ 46వ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మరో నిర్మాత సుదీప్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టడమే కాకుండా తన వద్ద డబ్బు తీసుకొని తనని మోసం చేశారు అంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం ఎన్ కుమార్ ( MN Kumar ) సుదీప్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు కురిపించారు సుదీప్( Kichcha Sudheep ) తన నిర్మాణంలో సినిమా చేస్తానని సుమారు 8 సంవత్సరాల క్రితం తనతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విధంగా తన నిర్మాణంలో సినిమాకు కమిట్ అవడంతో తాను ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చాను అని తెలిపారు.ఈ విధంగా తన వద్ద డబ్బు తీసుకొని సుదీప్ తనని మోసం చేశారని ఈయన ఆరోపణలు చేశారు.డబ్బు తీసుకున్న తర్వాత తనకు డేట్స్ ఇవ్వమని అడిగితే ఆయన తప్పించుకుంటున్నారని ఈ విషయంపై తన ఇదివరకే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు కూడా చేశానని నిర్మాత తెలియజేశారు.
అయినప్పటికీ ఆయన నాకు డేట్స్ ఇవ్వడం లేదని తెలిపారు.ఈ సినిమా టోటల్ రెమ్యూనరేషన్ కింద 9 కోట్లు ఇచ్చానని అలాగేతన వంటగది రెనోవేషన్ కోసం మరో 10 లక్షలు అధనంగా తీసుకున్నారు అంటూ నిర్మాత ఆరోపణలు చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







