ఉపాసనకు పెట్టాలనుకున్న పేరు తన కూతురికి పెట్టారా... అసలు విషయం చెప్పిన శోభన కామినేని!

మెగా కోడలు ఉపాసన( Upasana ) జూన్ 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ చిన్నారి బారసాల వేడుకను గత శుక్రవారం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 Did He Give The Name He Wanted To Give To His Daughter, Upasana, Ramcharan, Sobh-TeluguStop.com

ఈ బారసాల వేడుకకు అత్యంత సన్నిహితులు మెగా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.ఈ బారసాల వేడుకలో భాగంగా మెగా ప్రిన్సెస్ కు పేరు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిన్నారి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవి అలాగే ఉపాసన బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ చిన్నారి పేరును కూడా ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్( Ramchara ) లకు జన్మించిన ఈ చిన్నారికి లలితా సహస్రనామాల నుంచి ఎంపిక చేసినటువంటి క్లిన్ కారా(Klin Kaara) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.అయితే తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని( Sobhana Kamineni ) కూడా ఈచిన్నారి బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ చిన్నారి పేరు గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.నిజానికి ఈ పేరును ఉపాసనకు పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే శోభన కామినేని సోషల్ మీడియా వేదికగా బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ… ఉపాసన జన్మించిన తర్వాత తనకు క్లిన్ కారా అని నామకరణం చేయాలని భావించాను కానీ ఆ పేరు ఉపాసన కూతురికి పెట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా శోభన తన సంతోషం వ్యక్తం చేశారు.ఇలా తన తల్లి చేసిన పోస్ట్ పై ఉపాసన స్పందిస్తూ లవ్ యు మామ్ అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉపాసనకు పెట్టాలనుకున్న ఆ పేరును తన కుమార్తెకు పెట్టారా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube