ఉపాసనకు పెట్టాలనుకున్న పేరు తన కూతురికి పెట్టారా… అసలు విషయం చెప్పిన శోభన కామినేని!
TeluguStop.com
మెగా కోడలు ఉపాసన( Upasana ) జూన్ 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ చిన్నారి బారసాల వేడుకను గత శుక్రవారం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ బారసాల వేడుకకు అత్యంత సన్నిహితులు మెగా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.
ఈ బారసాల వేడుకలో భాగంగా మెగా ప్రిన్సెస్ కు పేరు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిన్నారి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవి అలాగే ఉపాసన బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ చిన్నారి పేరును కూడా ప్రకటించారు.
"""/" /
ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్( Ramchara ) లకు జన్మించిన ఈ చిన్నారికి లలితా సహస్రనామాల నుంచి ఎంపిక చేసినటువంటి క్లిన్ కారా(Klin Kaara) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని( Sobhana Kamineni ) కూడా ఈచిన్నారి బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ చిన్నారి పేరు గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
నిజానికి ఈ పేరును ఉపాసనకు పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
"""/" /
ఈ క్రమంలోనే శోభన కామినేని సోషల్ మీడియా వేదికగా బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.
ఉపాసన జన్మించిన తర్వాత తనకు క్లిన్ కారా అని నామకరణం చేయాలని భావించాను కానీ ఆ పేరు ఉపాసన కూతురికి పెట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా శోభన తన సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా తన తల్లి చేసిన పోస్ట్ పై ఉపాసన స్పందిస్తూ లవ్ యు మామ్ అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉపాసనకు పెట్టాలనుకున్న ఆ పేరును తన కుమార్తెకు పెట్టారా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్ ఆరడుగుల బంగారం.. మరోసారి ప్రశంసలు కురిపించిన బన్నీ!