నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ఇప్పుడు క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నాడు.ఈ మధ్య కాలంలో ఈయన మరింత హుషారుగా ముందుకు వెళుతున్నారు.
చేతిలో ఒక సినిమా ఉండగానే మరో సినిమాను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంటున్నాడు.ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari ) చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ అవ్వగా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కూతురు రోల్ లో నటిస్తుంది.ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా లాస్ట్ స్టేజ్ కు వచ్చింది.దీంతో బాలయ్య ఇటీవలే తన పుట్టిన రోజు నాడు మరో కొత్త మూవీ అనౌన్స్ చేసారు.
ఆ రోజే లాంచ్ చేయగా ఈ సినిమా యంగ్ డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో తెరకెక్కనుంది.
బాలయ్య తన 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించగానే అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాబీ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇటీవలే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో కూడా మాస్ మసాలా తీసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

ఇదే విషయం ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు టాక్.ఈ షూట్ అతి త్వరలోనే స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అప్పుడే వార్తలు వస్తున్నాయి.
ఇది పొలిటికల్ టచ్( Political ) ఉండబోతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రిలీజ్ అయ్యే అవకాశం ఉందట.దీంతో బాలయ్యకు కూడా రాజకీయంగా మంచి మైలేజ్ ఉంటుందని అంటున్నారు.
దీంతో ఈ సినిమా 2024 సమ్మర్ లో రిలీజ్ కావడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది.