న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు( Shakambari utsavalu ) ప్రారంభమయ్యాయి.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol-TeluguStop.com

2.అన్నవరం కొండపై ప్లాస్టిక్ నిషేధం

కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై శనివారం నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నామని( Plastic ban ) దేవస్థానం అధికారులు తెలిపారు.

3.గ్రూప్ 4 పరీక్ష రాస్తూ సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి

గ్రూప్ 4 పరీక్ష రాస్తూ,  ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో  పట్టుబడ్డాడు.సరూర్ నగర్ లోని సక్సెస్ కళాశాలలో ఈ ఘటన జరిగింది.

4.నేడు ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమావేశం

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

ప్రధానమంత్రి నరేంద్ర మోది( PM Narendra Modi ), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు మరికొంతమంది నేతలు ఈరోజు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.2024 సార్వత్రిక ఎన్నికలు,  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. 

5.పవన్ కళ్యాణ్ పై ఎంపీ విమర్శలు

సాధారణంగా మందు తాగిన వాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి కానీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎందుకు అలా ఊగుతున్నారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి ఎంపీ నందిగామ సురేష్ విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ ఊగుతూ వాగుతూ ఉంటారు,సురేష్ ప్రశ్నించారు.

6.ఈటెల రాజేందర్ భద్రత పెంపు

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajendar ) కు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటెల భద్రతను వై ప్లస్ గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

7.సీఎం రిలీఫ్ ఫండ్ లో అవినీతి కేసు నమోదు

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకోవడంపై  సిఐడి అధికారులు దీనిపై కేసు నమోదు చేశారు.

8.పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే విమర్శలు

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ విమర్శలు చేశారు భీమవరం సభపై పవన్ కళ్యాణ్ సస్పెన్స్ క్రియేట్ చేసి తుస్సుమనిపించారని గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు వేశారు.

9.మరో రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ కు  మెట్రో రైలు

మరో రెండేళ్లలో ఎయిర్ పోర్టు కు మెట్రో  రైలు( Metro Rail ) సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

10.ఐ ఎస్ బి సి చైర్మన్ గా డైరెక్టర్ రాజమౌళి

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ ( ఐ ఎస్ బి సి ) నూతన చైర్మన్గా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి నియమితులయ్యారు.

11.అమర్నాథ్ యాత్ర

సూపర్ శ్రద్ధ అమర్నాథ్ యాత్రకు జమ్మూకాశ్మీర్ ఏర్పాట్లు చేసింది.ఈరోజు నుంచి యాత్రికులు మంచు శివలింగం దర్శనానికి వెళ్తున్నారు.

12.దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

మాజీ మంత్రి చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు( Daggubati Venkateswara Rao ) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లిన దగ్గుపాటి అస్వస్థతకు గురయ్యారు.

13.కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

తన కూతురు , అల్లుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.అమాయకురాలైన తన కూతురిని అడ్డుపెట్టుకుని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని మండిపడ్డారు.

14.పవన్ కళ్యాణ్ పై అంబటి విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు( MP Ambati Rambabu ) తీవ్ర విమర్శలు చేశారు.విజయం లేని రాని రాజకీయ పార్టీ జనసేన అని రాంబాబు విమర్శించారు.

15.రఘునందన్ కు మద్దతుగా జితేందర్ రెడ్డి ట్విట్

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ను జాతీయ అధికార ప్రతినిధి చేయాలనే డిమాండ్ కు నేను సపోర్ట్ చేస్తా అంటూ బిజెపి నేత జితేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

16.రాహుల్ గాంధీకి హరీష్ రావు ప్రశ్నలు

Telugu Bhimavaram, Bjp, Delhi, Harish Rao, Janasena, Pawan Kalyan, Rahul Gandhi,

అగ్ర నేత రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి హరీష్ రావు( Harish Rao ) అనేక ప్రశ్నలు వేశారు.కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతుబంధు ఉందా అని హరీష్ రావు రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు.

17.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభం అవుతాయి.

18.నల్లమలలో జనసంచారం నిషేధం

నల్లమల అటవీ ప్రాంతంలో మూడు నెలలపాటు జనసంచారాన్ని నిషేధించారు.పులుల కలయిక సందర్భంగా అటు విశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

19.కాలేశ్వరం ఎత్తిపోతల పథకం పై కాగ్ నివేదిక

కాలేశ్వరం ఎత్తిపోతల పథకంతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపారని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54, 150

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59,070

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube