గిరిజనులపై కేసులను ఎత్తేస్తాం.. కేసీఆర్

తెలంగాణ వచ్చాక దాదాపు నాలుగు వేల గిరిజనుల తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.గతంలో మన్యం మంచం పట్టే పరిస్థితి ఉండేదన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.

 We Will Raise Cases Against Tribals.. Kcr-TeluguStop.com

ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీని కూడా తెచ్చుకున్నామని తెలిపారు.ఈ ఒక్క జిల్లాలోనే 47 వేల ఎకరాలకు పోడు పట్టాలిస్తున్నామని పేర్కొన్నారు.

పోడు పట్టాలు పొందిన గిరిజనులకు రైతుబంధు ఇస్తామన్నారు.ఆదివాసీ, గిరిజనుల పొలాలకు త్రీ పేస్ కరెంట్ ను ఇస్తామని చెప్పారు.

పోడు భూముల అంశంలో గిరిజనులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.ధరణిపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

నిరుపేదల కోసమే కంకణం కట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube