అమెరికాలో భారతీయుడి చరిత్ర : స్టాఫోర్డ్ సిటీ మేయర్‌గా ఎన్నిక.. ఎవరీ కెన్ మాథ్యూస్ ..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .

 Indian Origin Ken Matthew Becomes First Indian-american Mayor Of Stafford In Tex-TeluguStop.com

ఉదాహరణకు అమెరికాను( America ) తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.

అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు( Republicans, Democrats ) తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

టెక్సాస్ రాష్ట్రంలోని స్టాఫోర్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన కేన్ మాథ్యూస్( Kane Matthews ) ఎన్నికయ్యారు.తద్వారా ఈ నగరంలో ఈ పదవిని అందుకున్న తొలి ఇండో అమెరికన్‌గా, తొలి నల్లజాతీయుడిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.

స్టాఫోర్డ్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యుడైన మాథ్యూస్( Matthews ).ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రస్తుత మేయర్ సెసిల్ విల్లీస్‌పై( Cecil Willis ) 16 ఓట్ల తేడాతో గెలుపొందారు.మిస్సౌరీ సిటీ మేయర్ , భారతీయ-అమెరికన్ రాబిన్ ఇలాకుట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో మాథ్యూస్ ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Telugu Cecil Willis, Democrats, Indian American, Kane Matthews, Republicans, Tex

ఈ కార్యక్రమానికి హాజరైన ఇండియన్-అమెరికన్, ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కె.పి.జార్జ్ ట్వీట్ చేస్తూ.కొత్తగా ఎన్నికైన స్టాఫోర్డ్ మేయర్ కెన్ మాథ్యూస్‌కు అభినందనలు తెలిపారు.

ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని జార్జ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్సాస్ ప్రతినిధులు రాన్ రేనాల్డ్స్ , సులేమాన్ లులానీ , మిస్సోరి సిటీ మాజీ మేయర్ ఓవెన్ అలెన్ పాల్గొన్నారు.

మరోవైపు మాథ్యూస్‌కు కేంద్ర మంత్, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

Telugu Cecil Willis, Democrats, Indian American, Kane Matthews, Republicans, Tex

కేరళకు చెందిన మాథ్యూస్.67 సంవత్సరాల స్టాఫోర్డ్ సిటీ కౌన్సిల్‌ చరిత్రలో మేయర్‌గా ఎన్నికైన తొలి భారతీయుడిగా నిలిచారు.2006లో తొలిసారిగా స్టాఫోర్డ్ సిటీ కౌన్సిల్‌కు ఆయన ఎన్నికయ్యారు.కొన్నేళ్లపాటు సిటీ ప్లానింగ్ అండ్ జోనింగ్ కమీషన్‌లో మాథ్యూస్ పనిచేశారు.కేరళకు చెందిన మాథ్యూస్ 1970లలో బాంబే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు.

ఎంబీఏ చదివిన అనంతరం.హ్యూస్టన్‌లోని పలు సంస్థల్లో అకౌంటెంట్, ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.1982 నుంచి స్టాఫోర్డ్‌లో నివసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube