స్వయం ఉపాధి యూనిట్ల ( Self-employment units )తో మహిళలు ఆర్థికాబివృద్ధి సాధించవచ్చని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్( Ogg Rajitha Yadav ) అన్నారు.బుదవారం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో ప్రధాన మంత్రి ఆహార ఉత్పత్తుల సంస్థ ద్వార ముత్యాల మాధవి కి మంజూరైన పాప్ కార్న్ యూనిట్ ను ఆమె పరిశీలించారు.
ఇలా తయారు చేయడం తాజా ఉత్పత్తి లతో ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అన్నారు.ఇట్లాంటి యూనిట్ల ను నెలకొల్పడం ద్వారా యూనిట్ ను బట్టి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని అమే అన్నారు.
ఒక్కో పాప్ కార్న్( Popcorn ) ప్యాకెట్ కు 10 రూపాయల చొప్పున అమ్మనున్నట్లు నిర్వాహకురాలు ముత్యాల మాధవి తెలిపారు.ఆహార ఉత్పత్తుల మిషన్ తో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మాధవి నీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అభినందించారు.