టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే.ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రాకేష్ మాస్టర్ అభిమానులు ఆయన చనిపోకముందు చేసిన వీడియోలను వైరల్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా రాకేష్ మాస్టారు మృతి పై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopalakrishna ) స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియో చేశారు.
వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.
రాకేశ్ మాస్టర్‌తో నేను ఎక్కువగా పనిచేయలేదు కానీ, ఆయన గురువైన ముక్కురాజు గారితో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశాను.ఆ తర్వాత ఢీ, జబర్దస్త్ కార్యక్రమాల్లో రాకేశ్ మాస్టర్‌ను చూశాను.
సడెన్‌గా ఆయన ఇకలేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను.తాజాగా వాళ్ల అబ్బాయి ఒక మీడియాతో మాట్లాడుతూ మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా మానేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు.1500 పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
అలాగే శేఖర్ మాస్టర్( Sekhar Master ) జానీ మాస్టర్( Johnny Master ) లాంటి ఇద్దరు అద్భుతమైన కొరియోగ్రాఫర్లను మన ఇండస్ట్రీకి అందించారు.వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది.రాకేశ్ మాస్టర్ ఆవేదనను మరొక రూపంలో వెల్లబుచ్చారు.కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.అప్ కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకుల్లో ఎవరో ఒకరు ఆయన్ని మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం.
ఆయన ఇంటర్వ్యూలను చాలా మంది చూడడం నేను గమనించాను.ఆ ఇంటర్వ్యూల్లో ఆయన తన ఆవేదనను వినిపించారు.వాటిని చూసిన ప్రతిసారి ఆయన ఇంత బాధపడ్డారా అనుకున్నాను.
ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవాలి.భగవంతుడు మనకు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బాధపడుతూ కూర్చోకూడదు.
అది కుదరనప్పుడు మరోమార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.
.