ముఖ్యమంత్రి పదవి మంత్రదండం కాదు: పవన్

ముఖ్యమంత్రిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ వారాహి యాత్ర సా(Varahi Yatra )క్షిగా ప్రజలను అభ్యర్థించిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరోసారి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.వారాహి యాత్ర లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన సమావేశంలో తూర్పు కాపు సంఘాల నేతలతో ఆయన మాట్లాడారు.

 Power Is Not A Majic Wand Says Pawan Kalyan ,pawan Kalyan, Ap Politics , Chandra-TeluguStop.com

ఈ సందర్భంగా పార్టీలో చేరడానికి తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రశేఖర్ తన అనుచర వర్గంతో పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిన పవన్ కులాల సమీకరణ పై కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో తూర్పు కాపులు సంఖ్య 25 లక్షల ఉందని తెలుగుదేశం చెబితే 16 లక్షల ఉందని వైసిపి ప్రభుత్వం చెబుతుందని అలా చెప్పడానికి ప్రాతిపదిక ఏమిటని , వీరి సంఖ్య దాదాపు 45 లక్షల వరకూ ఉంటుందని ఈ సంఘాల నేతలు చెప్తున్నారని పథకాల లబ్ది దారుల సంఖ్యను తగ్గించడానికి ఇలా ప్రభుత్వ మాట్లాడుతుందని తెలిపారు.

Telugu Ap, Chandra Babu, Chandra Shekar, Pawan Kalyan, Godavari, Ys Jagan-Telugu

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులాల గణన చేపడుతామని తూర్పు కాపులకు సరైన న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి పదవి మంత్రదండం కాదని చట్టం తన పని తాను చేసుకుపోతే ఇలా కులాల వారి న్యాయం చేయాల్సిన అవసరం ఉండదని , ఎప్పుడైతే వ్యవస్థలు ఫెయిల్ అవుతాయో అప్పుడు కులాల వారి సమస్యలు ముందుకు వస్తాయని ఆయన తెలిపారు.

Telugu Ap, Chandra Babu, Chandra Shekar, Pawan Kalyan, Godavari, Ys Jagan-Telugu

తప్పు చేస్తే ఎవరినైనా నిలదీసే చైతన్యవంతమైన వ్యవస్థ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ముఖ్యమంత్రి పదవి అన్నిటికి మంత్రదండం కాదని, తాను ముఖ్యమంత్రి గా ఉన్నా కూడా నిలదీసే వ్యవస్థ ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఈ సందర్భంగా వాఖ్యనించారు.పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని జనసేన పార్టీలో చేరిన సందర్భంగా తూర్పు కాపు నాయకులు వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube