కాంగ్రెస్ కు ఆప్ షాక్ ఇస్తోందా.. ?

2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మోడీని గద్దె దించాలని విపక్షాలన్నీ ఏకమౌతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే విపక్షాల ఐక్యత కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్( Nitish Kumar ) గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Is Aap A Threat To The Congress Party , Congress Party , Aap, Nitish Kumar, Ra-TeluguStop.com

ఇటీవల ఆయన అధ్యక్షతన పాట్నాలో విపక్ష పార్టీల అధినేతలు సమావేశం అయిన సంగతి విధితమే.కలిసికట్టుగా మోడీని ఎదుర్కోవలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరత్ పవార్, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్.

ఇలా రాజకీయ ఉద్దండులందరూ సమావేశం అయి తదుపరి కార్యాచరణకు సిద్దమయ్యారు.

Telugu Aam Aadmi, Aap Kejriwal, Congress, Nitish Kumar, Rahul Gandhi-Politics

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి విపక్షలను లీడ్ చేసే నాయకుడు ఎవరనేదే మొదటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న.అయితే విపక్షాలను లీడ్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, నాయకుడిగా రాహుల్ గాంధీ ఉంటారని హస్తం పార్టీ మొదటి నుంచి చెబుతోంది.అయితే రాహుల్ నాయకత్వానికి విపక్షాలు మద్దతు తెలుపుతయా లేదా అనేదే అసలు ప్రశ్న.

ఇటీవల జరిగిన సమావేశంలో కూడా రాహుల్ నాయకత్వంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.నితిశ్ కుమార్ తో పాటు ఇతరత్రా నాయకులంతా రాహుల్ నాయకత్వానికి మద్దతు తెలుపినట్లు సమాచారం.

Telugu Aam Aadmi, Aap Kejriwal, Congress, Nitish Kumar, Rahul Gandhi-Politics

అయితే ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party )మాత్రం రాహుల్ నాయకత్వానికి మద్దతు ఇవ్వడం లేదట.దీనికి కారణం డిల్లీ ఆర్డినేస్న్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేజృవాల్ అందరి మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆప్ కు మద్దతు తెలుపలేదు.అందుకే ఇప్పుడు విపక్షాల ఐక్యత విషయంలో రాహుల్ నాయకత్వానికి ఆప్ ఆద్మీ పార్టీ మద్దతు తెలపడం లేదట.

ప్రస్తుతం డిల్లీతో పాటు పంజాబ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆప్ బలంగా ఉంది.బిజెపి, కాంగ్రెస్ పార్టీల తరువాతి స్థానంలో ఆప్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి అలాంటి పార్టీ మద్దతు కాంగ్రెస్ కు లేకపోతే.ఆ ప్రభావం గట్టిగానే చూపే అవకాశం ఉంది.

మరి ఆప్ కు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube