స్మార్ట్ ఫోన్ దొంగతనం జరిగితే సులభంగా ట్రాక్ చేసేయండిలా..!

స్మార్ట్ ఫోన్( Smart Phone ) దొంగలించబడిన, కనిపించకుండా పోయిన దొరకడం కష్టం అని చాలామంది భావిస్తారు.అయితే దేశంలో స్మార్ట్ ఫోన్ల దొంగతనాలు( Mobile Robbery ) క్రమంగా పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

 Govt Launches Sanchar Saathi Portal Enables Tracking And Blocking Of Stolen Or L-TeluguStop.com

ఈ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఎక్కడ ఉందో సింపుల్ గా ట్రాక్ చేయొచ్చు.

ముందుగా కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి మ్యాటిక్స్ (CDoT) సరికొత్తగా రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) టెక్నాలజీని పలు రాష్ట్రాల్లో పరీక్షించి, దేశమంతా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కేంద్ర ప్రభుత్వం సూచనలతో సంచార్ సాథీ( Sanchar Saathi ) పేరుతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఓ పోర్టల్ లాంచ్ చేసింది.ఈ పోర్టల్ సహాయంతో దొంగలించిన స్మార్ట్ ఫోన్ సులభంగా ట్రాక్ చేయవచ్చు.

కానీ ఈ పోర్టల్ ఉపయోగించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్య సూచనలు సూచించింది.అవి దృష్టిలో పెట్టుకొని పోగొట్టుకున్న ఫోన్ ట్రాకింగ్ చేయాలి.

అవి ఏమిటంటే ముందుగా స్మార్ట్ ఫోన్ దొంగలించబడిన లేదంటే కనిపించకుండా పోయిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, వారి నుంచి ఎఫ్ ఐ ఆర్ నెంబర్ తీసుకోవాలి.అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ ఇన్ వాయిస్ కూడా దగ్గర ఉండాలి.

వీటితోపాటు ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.ఇవన్నీ ఉంటే ఆ పోర్టల్ లో లాగిన్ అవ్వాలి.

Telugu Central, Complaint, Sanchar Saathi, Stolen-Technology Telugu

సంచార్ సాథీ https://crime.sancharsaathi.gov.in/ అనే పోర్టల్ ఓపెన్ చేస్తే వెంటనే అక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.దొంగలించిన, పోగొట్టుకున్న మొబైల్ బ్లాక్ చేయడం, దొరికిన మొబైల్ ను అన్ లాక్ చేయడం, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడం అనే ఆప్షన్లు ఉంటాయి.అందులో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ పై క్లిక్ చేయండి.అక్కడ ఒక పేజీ ఓపెన్ అయితే అందులో మొబైల్ ఫోన్ కు సంబంధించిన డేటాను నమోదు చేయాల్సి ఉంటుంది.

Telugu Central, Complaint, Sanchar Saathi, Stolen-Technology Telugu

తరువాత ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేసి, మొబైల్ ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేయాలి.తరువాత మొబైల్ బ్రాండ్ ని ఎంచుకొని మీ మొబైల్ ఇన్వాయిస్ ను అప్లోడ్ చేయాలి.ఇక చివరగా దొంగతనం ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే వివరాలతో పాటు మీ దగ్గర ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలు, ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డిక్లరేషన్ను గుర్తించి సబ్మిట్ చేయాలి.అంతే ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి మీ ఫోన్ ట్రాక్ చేయబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube