అప్పుడు బెలూన్లు అమ్మాడు.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీ నిర్మించారు.. ఎంఆర్ఎఫ్ ఫౌండర్ సక్సెస్ స్టోరీ ఇదే!

సాధారణంగా సినిమాలలో తక్కువ సమయంలో కోటీశ్వరులు కావడం జరుగుతుంది.అయితే నిజ జీవితంలో సైతం ఎంతో కష్టపడి తక్కువ సమయంలో కోటీశ్వరులు అవుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

 Mrf Founder Success Story Details Here Goes Viral In Social Media , Mrf Founder-TeluguStop.com

ఎంఆర్ఎఫ్ ఫౌండర్ మామ్మెన్ మాప్పిళ్లై( MRF Founder Mammen Mappillai ) గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దేశంలోని అతిపెద్ద టైర్ల కంపెనీలలో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ( Madras Rubber Factory ) ఒకటి.

మామ్మెన్ మాప్పిళ్లై( Mammen Mappillai ) ఎంతో కష్టపడటం వల్లే ఆయన వ్యాపారంలో కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదించడం సాధ్యమైంది.మద్రాస్ వీధులలో బెలూన్లు అమ్ముతూ కెరీర్ ను మొదలుపెట్టిన మామ్మెన్ మాప్పిళ్లై బొమ్మల బెలూన్లను తయారు చేసి అమ్మేవాడు.

ఆ తర్వాత మామ్మెన్ మాప్పిళ్లై ఒక సంఘటన వల్ల టైర్ల వ్యాపారంలోకి రావాలని భావించి ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Telugu Cheetah Street, Mrf, Madrasrubber, Mrf Founder, Mrffounder-Latest News -

మద్రాస్ లోని చీటా స్ట్రీట్ ( Cheetah Street )లో తొలి కార్యాలయాన్ని మొదలుపెట్టిన మామ్మెన్ మాప్పిళ్లై నాలుగేళ్లలో 50 శాతం మార్కెట్ ను సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత టైర్ల వ్యాపారంలోకి మాప్పిళ్లై ఎంట్రీ ఇచ్చారు.1960 సంవత్సరంలో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మామెన్ మాప్పిళ్లై మొదలుపెట్టారు.అమెరికాకు చెందిన ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని మామెన్ ఎం.ఆర్.ఎఫ్ ( M.R.F )ను ఆవిష్కరించారు.

Telugu Cheetah Street, Mrf, Madrasrubber, Mrf Founder, Mrffounder-Latest News -

1967 సంవత్సరంలో ఈ సంస్థ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది.భారతీయ రోడ్లకు అనుగుణంగా టైర్లను తయారు చేయడంతో పాటు మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో సక్సెస్ అయ్యారు.ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 42,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

ప్రతి సంవత్సరం కంపెనీ ఆదాయం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఈ కంపెనీ భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తుండటం గమనార్హం.

మామ్మెన్ మాప్పిళ్లై ఉన్నత స్థాయికి ఎదిగినా ఇప్పటికీ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube