Ammu Abirami : అలాంటి ప్రశ్న వేసిన నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నటి?

ఇదివరకటి రోజుల్లో అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవారు.అంతేకాకుండా సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవ్వడానికి లెటర్లు రాసి పంపేవారు.

 Ammu Abirami Replied To A Follower-TeluguStop.com

వారు చెప్పాలి అనుకున్న విషయాన్ని ఆ లెటర్ లలో రూపంలో రాసి పంపించేవారు.కానీ రాను రాను టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో పాటు సోషల్ మీడియా( Social media ) వాడకం పెరిగిపోవడంతో అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది.

దీంతో అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.

Telugu Ammu Abirami, Kollywood, Reply, Tollywood-Movie

డైరెక్ట్ గా సెలబ్రిటీలను అడిగి సమాధానాలను తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ ఆకతాయిలు మితిమీరి హీరో హీరోయిన్ లను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు వేస్తున్నారు.మరి ముఖ్యంగా హీరోయిన్ లకు ఇలాంటి చేదు అనుభవాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి.

కొందరు అటువంటి వాటిని చూసి చూడనట్టుగా వదిలేయగా మరికొందరు మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం ఇస్తూ ఉంటారు.తాజాగా కూడా ప్రముఖ నటి అమ్ము అభిరామి( Ammu abirami )ని ఒక నెటిజన్‌ బరువు గురించి ఒక ప్రశ్న అడిగాడు.

దానికి ఆమె స్పందిస్తూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.ఆ వివరాల్లోకి వెలితే.

Telugu Ammu Abirami, Kollywood, Reply, Tollywood-Movie

అమ్ము అభిరామి కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక ఫొటోని షేర్ చేసింది.ఆ ఫొటోపై ఒక నెటిజన్‌ స్పందిస్తూ ఈ మధ్య చాలా బరువు పెరిగినట్లు ఉన్నారు అని ప్రశ్నించాడు.దానికి అభిరామి సమాధానం ఇస్తూ.అయితే ఏంటి? అని అనగా వెంటనే సదరు నెటిజన్‌ ఈగో బాగా దెబ్బతింది.ఏం లేదు.ఇలానే బరువు పెంచుకుంటూ పో అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేసాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది.కొందరు ఈ విషయంపై స్పందిస్తూ సదరు నెటిజన్ వ్యవహరించిన తీరుకి మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube