విద్యాతోనే సామజిక చైతన్యం: పోలీస్ కమిషనర్

విద్యా అభివృద్ధి చెందితేనే సామాజిక చైతన్యం అభివృద్ధి చెందుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు.

 Social Awareness By Education Police Commissioner Vishnu S Warrier, Social Aware-TeluguStop.com

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్న విద్యా దినోత్సవ్ కార్యక్రమాన్ని చైర్ పర్సన్ హృదయ్ మెనాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన పోలీస్ కమిషనర్ ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఆనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారని అన్నారు.ప్రస్తుత పోటి ప్రపంచంలో విద్య అభివృద్ధి చెందితే సంస్కృతి, సామజిక విలువలు, ఆర్థిక ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు.

కెపియం పాఠశాలలో విద్య అర్హతలు కలిగి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో వున్నారని అన్నారు.వారు విద్య మార్పులకు అనుగుణంగా శిక్షణ తరగతులకు హజరై ఉత్తమ విద్యను విద్యార్థులకు అందించాన్నారు.

అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు గానం, నృత్యం, నాటకం, వ్యాసరచన పోటీలతో పాటు తెలంగాణ కవులు, రచయితల పఠన పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలని సూచించారు.ఈ సందర్భంగా సంస్కృతీక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆనంతరం పాఠశాల ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు.కార్యక్రమంలో అధిషనల్ డీసీపీ కుమారస్వామి, RI రవి, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube