తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్( Adipurush ) అంతా బాగానే ఉంది కానీ గ్రాఫిక్స్ చెడగొట్టాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.నాసిరకం గ్రాఫిక్స్ ను ఇంత భారీ సినిమాకు పెట్టడం ఏంటో అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాడు.
దాదాపుగా మూడు వందల కోట్ల కు పైగా గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేయడం జరిగిందట.అయినా కూడా ఇంత నాసిరకం గ్రాఫిక్స్ ను సినిమా లో చూపించారు.
రాజమౌళి తక్కువ ఖర్చు తోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ను చూపించడం మనం ఇప్పటికే పలు సినిమా ల్లో చూశాం.ఇటీవల వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతే కాకుండా సినిమా యొక్క గ్రాఫిక్స్ విషయం లో అవార్డు లు కూడా దక్కాయి.

అంతటి గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ను రాజమౌళి( Rajamouli ) మాత్రమే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఔట్ పుట్ తీసుకు రాగలడు అనే విషయం మరో సారి నిరూపితం అయ్యింది.అద్భుతమైన గ్రాఫిక్స్ ను రాజమౌళి మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేంత ప్రతిభావంతుడు అంటూ మరోసారి ఆదిపురుష్ సినిమా తర్వాత నిరూపితం అయ్యింది.ఆదిపురుష్ సినిమాకు అంత గా ఖర్చు చేసినా కూడా గ్రాఫిక్స్ తీవ్రంగా నిరాశ పర్చింది.
అంతే కాకుండా ఆదిపురుష్ సినిమా యొక్క గ్రీన్ మ్యాట్ సన్నివేశాలను కూడా సరిగ్గా పూర్తి చేయలేక పోయారు.ఏడాది పాటు గ్రాఫిక్స్ కోసం టైమ్ కేటాయించారు.

బాగా రాలేదు అని మరో ఆరు నెలల సమయం తీసుకుని మరీ సినిమా యొక్క గ్రాఫిక్స్ చేశారు.కానీ జక్కన్న సినిమా లముందు ఆ సినిమా లు తేలిపోయాయి.ఆదిపురుష్ సినిమా విషయం లో జరిగిన తప్పులను ముందు ముందు ఫిల్మ్ మేకర్స్ జరగకుండా చూసుకోవాలని అంతా కూడా సూచిస్తున్నారు.







