యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్ జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.రామాయణం( Ramayanam ) ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.
ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ ( Kriti Sanon )సీత పాత్రలో నటించింది.స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Rauth ) తెరకెక్కించాడు.జూన్ 16న వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచింది.
ఈ సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.

భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించు కున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.దీంతో ఈ కలెక్షన్స్ విన్నవారంతా కళ్ళు తేలేసారు.ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా హవా చూపించింది.2వ రోజు ఆదిపురుష్ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు ఈ మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.దీంతో ప్రభాస్ ఖాతాలో మరో 100 కోట్లు జమ అయ్యాయి.
ఆదిపురుష్ సినిమా రెండు రోజుల్లోనే 240 కోట్ల మార్క్ ను అయితే టచ్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో దండయాత్ర చేస్తుంది.ఈ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
వీకెండ్ మాత్రం భారీగా రాబట్టే ఈ సినిమా వీకెండ్ తర్వాత అసలు పరీక్ష ఎదుర్కోబోతుంది.ఈ సినిమా అప్పుడు రాబట్టే కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమాకు లాభాలు వస్తాయా లేదంటే నష్టాలు వస్తాయా అనేది తేలిపోనుంది.
చూడాలి మండే టెస్ట్ లో ఆదిపురుష్ వసూళ్లు ఎలా ఉంటాయో.







