కుటుంబంలోని పెద్దలు పిల్లలకు పెళ్లిళ్లు చేసి, కుటుంబ బాధ్యతను వారికి అప్పగించి ఓ మూలన కూర్చుందామని అనుకుంటారు.ఇక మనవడు, మనవరాళ్లతో మిగిలిన జీవితం గడపాలి అనుకుంటారు.
అందుకోసం అటూ ఏడు తరాలు.ఇటు ఏడు తరాలు చూసి మంచి అమ్మాయిని ఇంటికి కూడలిగా తీసుకువచ్చి అన్ని బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారు.
అయితే ఓ కుటుంబం కూడా ఎదిగిన ఇద్దరూ అబ్బాయిలకు, అక్కాచెల్లెలను( boys , sisters ) ఇచ్చి వివాహం చేశారు.కానీ పెళ్లి అయిన ఐదు రోజులకే అక్కాచెల్లెళ్లు అత్తింటికి కన్నం వేసి దొరికినంత దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం.

వివరాల్లోకెళితే.మధ్యప్రదేశ్లోని గ్వాలియర్( Gwalior in Madhya Pradesh ) లోని తాటీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్పన్ కాలనీకి చెందిన భరత్ గుప్తా, రోహిత్ గుప్తాలకు( Bharat Gupta , Rohit Gupta ) ఇటీవలే ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ కి చెందిన సంజన, అంజలీలతో ఈనెల 11న వివాహం జరిగింది.ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లను వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య సంతోషాలు ఆకాశాన్ని ఉంటాయి.భరత్ గుప్తా అత్త కొడుకు అయినా బంటీ గుప్తా స్నేహితుడు జీతూ ఈ పెళ్లిలను కుదిరించాడు.

పెళ్లి అయిన ఐదు రోజులకు ఈ అక్కాచెల్లెళ్లు అత్తారింటి వారికి ఝలక్ ఇచ్చారు.నూతన వధువులు మంచి అవకాశం కోసం ఎదురుచూసి ఇంట్లో ఉండే బంగారం తో పాటు రూ.2.5 లక్షల నగదును తీసుకొని పరారయ్యారు.అయితే ఇంట్లో అందరూ ఉన్నా కూడా వీరు దొంగతనం చేసి పారిపోవడం ఎవరు గమనించలేకపోయారు.తర్వాత నూతన వధువులు కనిపించకపోవడంతో వెంటనే ఇద్దరు వధువులకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఇంట్లో మొత్తం వెతికితే బంగారం ఇంకా డబ్బు కనిపించకపోవడంతో నూతన వధువులే దొంగతనం చేసి పోయారని నిర్ధారించుకున్నారు.వెంటనే తాటీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి కిలాడీ అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.







