ఆదిపురుష్ ( adipurush )సినిమా రెండు రోజుల్లో ఏకంగా 240 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.విడుదలకు ముందే ఈ సినిమాకు భారీ స్థాయిలో పబ్లిసిటీ జరగడం ఈ సినిమాకు ప్లస్ అయింది.
అయితే ఎవరూ ఊహించని విధంగా ట్విట్టర్ బ్యాన్ ఆదిపురుష్ ( Ban Adipurush )అంటూ 44000కు పైగా ట్వీట్లు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.ఆదిపురుష్ సినిమాను చంపేసే కుట్ర జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమాలో తప్పులు ఉండటం వాస్తవమే.ఈ సినిమా మేకర్స్ సైతం ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు.ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తాము చిన్నచిన్న మార్పులు చేశామని నెగిటివ్ కామెంట్లను పరిగణనలోకి తీసుకొని సినిమాలో కొంతమేర మార్పులు అయితే చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.కొంతమంది ఇప్పటికీ ఆదిపురుష్ సినిమాలో కొన్నిమైనస్ లు ఉన్నా ఎంతో కష్టపడి మేకర్స్ తెరకెక్కించారని కొంతమంది చెబుతున్నారు.

ఆదిపురుష్ సినిమా టైటిల్స్ పడక ముందే తమ ఊహలకు అనుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు చేశామని మేకర్స్ సైతం ఈ సినిమా చూసే ప్రేక్షకులను మానసికంగా ప్రిపేర్ చేశారు.అయితే ఈ సినిమాపై నెగిటివిటీ వేగంగా స్ప్రెడ్ అయ్యేలా కుట్రలు అయితే జరిగాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ మధ్య కాలంలో ఆదిపురుష్ కంటే చెత్తగా ఉన్న ఎన్నో సినిమాలు రిలీజైనా ఆ సినిమాకు ఈ స్థాయిలో నెగిటివ్ పబ్లిసిటీ జరగలేదు.
ఆదిపురుష్ సినిమాలో తప్పులు ఉన్నాయని అయితే మరీ ఘోరంగా, దారుణంగా, అసభ్యకరంగా విమర్శలు చేయడం మాత్రం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఆదిపురుష్ ను కొత్త వివాదాలు చుట్టుముడుతుండగా ఈ సినిమా మేకర్స్ ఆ సమస్యలకు ఎలా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.ఈ వివాదాలకు ఆదిపురుష్ మేకర్స్ చెక్ పెడతారో లేదో తెలియాల్సి ఉంది.







