ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది.నాయకన్ గూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







