సోషల్ మీడియా( Social media )లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా చిన్నారులు, జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.
ఇవి చూడటానికి చాలా ఫన్నీగా ఆలోచింపజేసేలా ఉంటాయి.దీంతో ఇలాంటి వీడియోలను బాగా వైరల్ చేస్తూ ఉంటారు.
లైక్‌లు, కామెంట్లు ఇలాంటి వీడియోలకు బాగా వస్తూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోలో ఒక పులి పిల్ల( Tiger cub )తో కలిసి ఎలుగుబంటి పిల్ల ఆటలు ఆడుకుంటోంది.రెండూ కలిసి అల్లారుముద్దుగా ఒకదానిపై ఒకటి ప్రేమను కురిపించుకుంటున్నాయి.రెండు స్నేహభావంతో కలిసిమెలిసి సరదాగా ఆడుకుంటున్నాయి.చిన్నపిల్లలు నవ్వుకుంటూ సరదాగా కలిసి ఆడుకుంటూ ఉంటారు.ఏమీ తెలియని వయస్సులో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు.ఇప్పుడు ఈ పులి, ఎలుబంటి పిల్ల కూడా అలాగే ఉన్నాయి.
క్రూరమృగాలైన పులి, ఎలుగుబంటి పిల్లలు ఇలా కలిసి ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియోలో పిల్ల ఎలుగుబంటి( Bear cub ).పులి పిల్లతో సరదాగా ఆడుకుంటోంది.ఎలుగుబంటి పిల్ల కౌగిలించుకోవాలని చూస్తుంటే పులి పిల్ల దాన్ని కాలితో నెట్టేసింది.
కొన్ని సెకన్ల పాటు ఉన్న వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
సింహం పిల్ల నిజంగా తప్పిపోయిందా.? అతి క్రూరమైన రెండు జంతువుల పిల్లల్లో రెండు మాత్రమే కనిపిస్తున్నాయంటూ కొంతమంది కామెంట్ చేస్తోన్నారు.ఇవి సాధారణ ఎలుగు, పులి పిల్లలు కాదని, షేర్ ఖాన్, బలూ అంటూ మరికొందరు కామెంట్ చేస్తోన్నారు.ఇలా నెటిజన్లు ఫన్నీగా కామెంట్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
ఏది ఏమైనా పులి, ఎలుగుబంZR పిల్లలు కలిసి ఆడుకోవడం కాస్త ఆసక్తికరమే అని చెప్పవచ్చు.







