జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో మృతదేహం లభ్యమైంది.నిన్న రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్యను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రామకృష్ణయ్యను హత్య చేసిన దుండగులు మృతదేహన్ని చెంపక్ హిల్స్ వద్ద పడేశారు.స్వగ్రామం పోచన్నపేట నుంచి బచ్చన్నపేటకు బైకుపై వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు రామకృష్ణయ్యను కిడ్నాప్ చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







