రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) సంచలన నిర్ణయాలతో హాట్‌టాపిక్‌గా మారుతున్నారు.తన నిర్ణయాలతో ప్రపంచానికే షాక్ ఇస్తున్నారు.
ఇప్పటికే ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగారు.ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తోన్నారు.
ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఇప్పటికే రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది.బాంబులతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో సృష్టిస్తున్న విధ్వంసం మాములుగా లేదు.
బాంబుల మోతతో ప్రజలు భయ భయంతో బ్రతుకుతున్నారు.ఏడాది కాలంగా ఈ యుద్దం ఇలాగే రెండు దేశాల మధ్య నిర్విరామంగా కొనసాగుతోంది.

ఉక్రెయిన్, రష్యా ( Ukraine )మధ్య జరుగుతున్న యుద్దానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.ఈ క్రమంలో బెలారస్, రష్యా మధ్య అణు ఆయుధాలకు సంబంధించిన ఒప్పందం సంచలనం రేపుతోంది .దీంతో బెలారస్( Belarus ) వేదికగా ఆణు యుద్దం తప్పదా? అనే అంచనాలు వెలువడుతున్నాయి.పుతిన్ అణు యుద్దానికి కూడా సై అంటున్నారు.
ఇదే జరిగితే ప్రపంచం మొత్తం సర్వనాశనమై పోతుందని, మూడో ప్రపంచ యుద్దం చూడాల్సి వస్తుందని చెబుతున్నారు.ఉక్రెయిన్‌పై పుతిన్ అణు యుద్దానికి దిగితే.
ప్రపంచంలోని చాలా దేశాలు చిన్న దేశమైన ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచి అవకాశం ఉంది.దీంతో ఉక్రెయిన్ మద్దతు దేశాలు, రష్యా మద్దతు దేశాల మధ్య భీకర పోరు జరిగే పరిస్ధితులు ఏర్పడతాయని అంటున్నారు.
అన్ని దేశాల్లో ఉన్న అణు బాంబులను ప్రయోగిస్తే ఇక ప్రపంచమే బూడిదై పోతుందని చెబుతున్నారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దంతో ప్రపంచదేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.బెలరాస్ కేంద్రంగా అణు యుద్దం తప్పేలా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదే జరిగితే హిరోషిమా, నాగసాకి పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా రానున్నాయి.
అయితే ఈ యుద్దాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంటుందనేది కూడా దిక్కుతోచడం లేదు.







