యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Hero Nikhil Siddharth ) తన కొత్త సినిమా నిర్మాత విషయంలో హార్ట్ అయినట్టు తెలుస్తుంది.గత కొద్దీ రోజులుగా స్పై మూవీ నిర్మాత రాజశేఖర్ రెడ్డికి, హీరో నిఖిల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అసలు వీరి మధ్య పంచాయితీ జరగడానికి కారణం స్పై రిలీజ్ డేట్ అనే చెప్పాలి.ఈ విషయం లోనే నిఖిల్, నిర్మాత మధ్య మాటలు లేవట.

జూన్ 29న స్పై మూవీ( Spy Movie ) రిలీజ్ చేయాలనీ నిర్మాత వాదన.కానీ అలా చేస్తే ప్రమోషన్స్ కు టైం సరిపోదని నిఖిల్ వాదన.ఇలా ఇద్దరి మధ్య నిర్మాతనే పై చేయి సాధించినట్టు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆ పోస్టర్ మీద మరోసారి జూన్ 29న రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసేసారు.
కార్తికేయ 2( Karthikeya 2 ) తర్వాత నిఖిల్ కు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెరిగింది.
దీంతో ఈ సినిమాను దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేయాలని నిఖిల్ ఆలోచన.
అందులోను డబ్బింగ్, కాస్త పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడంతో ఇవి పూర్తి చేసి మెల్లగా రిలీజ్ చేయాలని అనుకుంటే నిర్మాత మాత్రం ఇప్పటికే బిజినెస్ పూర్తి అయ్యింది.వాయిదా వేస్తె ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని ముందుగా ప్రకటించిన డేట్ కే రిలీజ్( Spy Release Date ) చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.

ఇలా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలోనే లిరికల్ వీడియో రిలీజ్ చేయడంతో నిఖిల్ హర్ట్ అయ్యాడని అందుకే ఆ వీడియోను కానీ నిన్న వచ్చిన కొత్త పోస్టర్ కానీ తన సోషల్ మీడియాలో షేర్ చేయలేదని తెలుస్తుంది.కానీ నిఖిల్ తనకు సంబంధించిన పెండింగ్ షూట్ తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.దీంతో ఈయనకు ఇష్టం లేకపోయిన ఈయన సైడ్ నుండి ఎలాంటి పనులు లేకుండా తన పూర్తి సహకారం అయితే అందించారు.
యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ ( BH Garry )దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 29న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
మరి ఈ సినిమాతో ఈయన హ్యాట్రిక్ విజయం సాధిస్తాడా లేదా చూడాలి.







