ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు ( overweight )అలాగే ఉబకాయం అనే సమస్యలతో సతమతమవుతున్నారు.ఈ అధిక బరువును తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నో వ్యాయామాలు ఎన్నో డైటింగ్లు చేస్తున్నారు.అయినప్పటికీ అధిక బరువు కంట్రోల్ చేయలేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కానీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వలన బరువును ఈజీగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని చిట్కాల ద్వారా అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.
ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది బెండకాయలు( ladies finger ) తింటే మంచిదని అంటూ ఉంటారు.ఎందుకంటే ఈ కూరగాయలో ఫైబర్( Fiber ) అధికంగా ఉంటుంది.ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా బరువు తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది.చాలామంది కాకరకాయ రుచి కారణంగా ఇష్టపడరు.
అయితే అలాంటి కాకరకాయ( Kakarakaya ) ఎన్నో వ్యాధులకు బాగా ఉపయోగపడుతుంది.ఇక దీనిని నిత్యం తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులుకు చాలా మేలు జరుగుతుంది.
ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
దీనిలో ఫైబర్ అధికంగా ఉండడంతో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.సొరకాయలో పోషకాలతో పాటు నీటి శాతం అధికంగా ఉంటుంది.అందుకే వేసవిలో బరువు తగ్గాలనుకున్నవారు సొరకాయ జ్యూస్( Zucchini juice ) తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
అధిక బరువు తగ్గాలంటే సొరకాయ రసం తయారు చేసుకుని తాగాలి.వేసవికాలంలో దోసకాయలు బాగా దొరుకుతాయి.ఇందులో కూడా నీరు చాలా ఎక్కువగా ఉంటుంది.దోసకాయ తీసుకోవడం వలన మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.అలాగే దీనిలో జీరో క్యాలరీలు ఉంటాయి.
కాబట్టి ఇది బరువు తగ్గించడానికి చాలా సహాయపడుతుంది.