భయపెట్టే సన్నివేశాలు మాత్రమే విరూపాక్ష సక్సెస్ కు కారణం కాదు.. పరుచూరి కామెంట్స్ వైరల్!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) , నటి సంయుక్త మీనన్( Sanyuktha menon ) జంటగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరూపాక్ష ( Virupaksha ).ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టింది.

 Scary Scenes Alone Are Not The Reason For Virupaksha's Success , Sai Dharam Tej,-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ( Parachuri Gopalakrishna ) మాట్లాడుతూ ఈ సినిమాపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

విరూపాక్ష సినిమా కోసం రచయిత ప్రభాకర్ అందించిన డైలాగ్స్ చాలా సహజ సిద్ధంగా ఉన్నాయనీ పరుచూరి వెల్లడించారు.

Telugu Gopalakrishna, Sai Dharam Tej, Sanyuktha Menon, Virupaksha-Movie

ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ ను ప్రభాకర్ చాలా శ్రద్ధగా రాసారని పరుచూరి తెలిపారు.ఒక చిన్న పల్లెటూరిలో జరిగే కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారని ఈయన ప్రశంసలు కురిపించారు.ప్రస్తుత కాలంలో ఒక సినిమా రెండు మూడు వారాలు థియేటర్లో ప్రసారం అవ్వడం అంటే గగనం అలాంటిది ఈ సినిమా ఏకంగా 100 కోట్లు రాబట్టింది అంటే ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభించిందో అర్థమవుతుంది.

ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఊరి సమస్యను పరిష్కరించిన తీరును చూపించడం చాలా బాగుందని పరుచూరి తెలియచేశారు.

Telugu Gopalakrishna, Sai Dharam Tej, Sanyuktha Menon, Virupaksha-Movie

రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు ఒక త్రిల్లింగ్ అనుభూతిని కలిగించడం అంటే మామూలు విషయం కాదు.ఈ విషయంపై దర్శకుడుని అభినందించాల్సి ఉంటుందని తెలిపారు.ఇక ఈ సినిమాలో తాంత్రిక పూజలు,భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి కనుక ఈ సినిమాని చూడటం కోసం జనాలు థియేటర్ కి వచ్చారు.

అనడంలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.ఇలా ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించడానికి ప్రధాన కారణం కథ.అదేవిధంగా స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉందని పరుచూరి తెలిపారు.ఇక ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు,అజయ్ ఈ నలుగురికి మంచి మార్కులు వేయవచ్చని ఈ సందర్భంగా విరూపాక్ష సినిమా గురించి పరుచూరి విశ్లేషిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube