ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప2 సినిమా( Pushpa 2 ) చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా కోసం బన్నీ రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారు.
బన్నీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో బన్నీ సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం.తాజాగా బన్నీ మల్టీప్లెక్స్ అయిన ఏఏఏ సినిమాస్( AAA Cinemas ) గ్రాండ్ గా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే…
ఏఏఏ (AAA) సినిమాస్ లో బన్నీ గ్యాలరీ ఉండగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే బన్నీ గ్యాలరీ( Bunny Gallery )లో తన కుటుంబ సభ్యుల స్టిల్స్ ఉన్నా చిరంజీవితో బన్నీ కలిసి దిగిన స్టిల్ లేకపోవడం మెగా అభిమానులను ఒకింత హర్ట్ చేస్తుండటం గమనార్హం.చిరంజీవి ఫోటో ఎక్కడ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.చిరంజీవి బన్నీ( Chiranjeevi Bunny ) కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది…
చిరంజీవి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను పెంచుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు.
భోళా శంకర్( Bhola Shankar ) ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లు మాత్రం వచ్చే ఏడాది షూటింగ్ జరుపుకునున్నాయని తెలుస్తుంది.ఇక చిరంజీవి కూడా వరస సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నారు…
.