మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఘుమ్మంది నాదం( Jhummandi Nadam Movie ) ఈ సినిమాతోనే తాప్సీ( Taapsee ) తెలుగు తెర కి పరిచయం అయింది…ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవకాశాలను అందుకుంటు మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు…
ఇదివరకే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి పలుసార్లు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) ఉండే పక్షపాత ధోరణి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బీ టౌన్ క్యాంపులను ఉద్దేశిస్తూ గతంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే…
అయితే తాజాగా ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తాప్సి ప్రియాంక చోప్రా వ్యాఖ్యలపై స్పందిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ బి టౌన్ ఇండస్ట్రీలో క్యాంపులు, ఫేవరిటిజం, ఉంటాయనే సంగతి మనకు తెలిసింది.ఒక సినిమాలో నటీనటులు వాళ్లు స్నేహితులు వాళ్ల ఏజెన్సీలు తమ సినిమాలలో ఎవరిని తీసుకోవాలని అనుకుంటే వాళ్లనే తీసుకుంటారు.ఇది పూర్తిగా వాళ్ళ కెరియర్ కు సంబంధించిన విషయం కాబట్టి ఎవరిని తప్పు పట్టడానికి లేదు…
అయితే ఈ పరిశ్రమలోకి వచ్చే ముందే నాకు ఇక్కడ పక్షపాత ధోరణి ఉందనే విషయం తెలుసు అంటూ ఈ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి ఉందంటూ తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఇదే విషయం గురించి సిటాడేల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ప్రియాంక చోప్రా కూడా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే… ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ల భావాలని తెలుపుతూ మాట్లాడుతున్నారు…
.