డైరెక్టర్ ఓం రౌత్ కి క్లాస్ పీకుతున్న ప్రభాస్

ఆదిపురుష్ సినిమా( Adipurush ) ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా ఈ మూవీ విడుదల అయింది .ఇక ఈ మూవీకి కొంత‌మంది నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తే… మ‌రికొంత‌మంది మాత్రం నెగిటివ్ టాక్ వినిపిస్తోంది.

 Prabhas Fires On Director Om Raut Over Adipurush Result,prabhas,director Om Raut-TeluguStop.com

సినిమాలో జ‌రిగే రామ, రావణ యుద్ధంలో కొన్ని సన్నివేశాలు బాహుబలి( Baahubali ) లో యుద్ధాన్ని పోలినట్టు ఉందని అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు.యుద్ధం కొత్తగా ఉంటే బావుండేదనే టాక్ వినిపిస్తోంది.

రావణుడిని రాముడు త్వరగా చంపేస్తే థియేటర్ నుంచి బయట పడొచ్చనే విధంగా తీశారు.ప్రభాస్ మినహా ఆదిపురుష్ కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో మెజారిటీ శాతం ఉత్తరాది జనాలు ఉన్నారు.

 Prabhas Fires On Director Om Raut Over Adipurush Result,Prabhas,Director Om Raut-TeluguStop.com

వాళ్ళలో తెలుగు పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది చాలా తక్కువ మందికి.దర్శకుడు కూడా హిందీ వ్యక్తి కావడంతో చాలా సీన్లు హిందీలో తీశారని సినిమా చూస్తుంటే అర్థం అవుతోంది.

Telugu Adipurush, Om Raut, Prabhas-Telugu Top Posts

కొన్ని సీన్లలో డబ్బింగ్, లిప్ సింక్ మధ్య సమన్వయం కుదరలేదు.అదీ నెగిటివ్ టాక్ రావడానికి ఓ రీజన్ అని చెప్పాలి.ఆదిపురుష్లో మీసాల రాముడిగా ప్రభాస్ ను చూపించడంపై విడుదల కంటే ముందు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.అయితే… సినిమా విడుదల సరికి లుక్ మీద పెద్దగా విమర్శలు రాలేదు.యుద్ధ సన్నివేశాల్లో బావున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.అయితే… ఇంటర్వెల్ తర్వాత తండ్రి దశరథ మహారాజుతో రాముడు మాట్లాడే సన్నివేశాల్లో లుక్ మీద విమర్శలు వచ్చాయి .

Telugu Adipurush, Om Raut, Prabhas-Telugu Top Posts

తెల్లటి దుస్తుల్లో ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రామాయణంలో లంక( Lanka ) అంటే ఇప్పటి శ్రీలంక.భూమి మీద అదీ ఒక భాగమే.లంక అంటే అదేదో వేరే లోకం అన్నట్లు దర్శకుడు ఓం రౌత్( Director Om Raut ) చూపించారు.సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లోకాన్ని డిజైన్ చేసినట్టు డిజైన్ చేశారు.లంకలో రావణుడిని సైన్యాన్ని గ్రహాంతర వాసుల తరహాలో చూపించార‌ని క్ అంటున్నారు.

ఇలాంటివి నెగిటివ్ గా లేక‌పోయి ఉంటే వంద కు వంద శాతం ఆదిపురుశ్ కు పాజిటివ్ టాక్ వ‌చ్చేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.విజువల్ పరంగా ఉన్నతంగా తీర్చిదిద్దిన కొన్ని చిన్న చిన్న లోపాల కారణంగా సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది .ఇక దీనితో టీజర్ సమయంలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలని మరోసారి వైరల్ చేస్తున్నారు .అప్పుడు టీజర్ పై విమర్శలు రాగ .టీజర్ విడుదల కార్యక్రమం అయ్యాక .ప్రభాస్ డైరెక్టర్ ని ఉద్దేశించి ఓం కమ్ టు మై రూమ్ అంటూ గట్టిగ పిలవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది .ఇక సినిమా చూసాక ప్రభాస్ మరోసారి రూమ్ కి పిలిచి వార్ణింగ్ ఇవ్వడం ఖాయమన్న వ్యాఖ్యలు మరోసారి వినిపిస్తున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube